
మీ ఇంట్లో మూల మూలన ఉన్న బొద్దింకలను తరిమికొట్టే ఇంటి చిట్కాలు మీకోసం
ఈ వార్తాకథనం ఏంటి
బొద్దింకలను చూడగానే జుగుప్స కలుగుతుంది. మొహం అదోలా పెట్టి ఒకలాగా అసహ్యించుకుంటారు. అంతేకాదు, బొద్దింకల వల్ల ఆహారం కలుషితం అవుతుంది.
ఇంట్లో ఉన్న బొద్దింకలను తరిమికొట్టడానికి మార్కెట్లో రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ కిచెన్లో ఉన్న వస్తువులతో బొద్దింకలను తరిమికొట్టే ఇంటి చిట్కాలు ఏంటో చూద్దాం.
బేకింగ్ సోడా:
ఉల్లిగడ్డలను ముక్కలుగా కోసి బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో పెట్టాలి. ఆ తర్వాత ఆ ముక్కలపై బేకింగ్ సోడాను చల్లాలి. ఈ ఉల్లిగడ్డలను బొద్దింకలు తింటే అవి చనిపోతాయి.
బోరికామ్లం:
ఈ బోరిక్ యాసిడ్ ని బొద్దింకలున్న ప్రదేశంలో పోయాలి. ఈ యాసిడ్ ని తిన్న బొద్దింకల్లో జీర్ణవ్యవస్థ పాడవుతుంది. దానివల్ల క్రమంగా బొద్దింక చచ్చిపోతుంది.
Details
బొద్దింకలను బయటకు లాగే బిర్యానీ ఆకు
వేప:
వేప నూనె తీసుకుని బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో స్ప్రే చేయాలి. లేదంటే వేప పొడి తీసుకుని అంతటా జల్లాలి. దీనివల్ల పిల్ల బొద్దింకలు చనిపోతాయి, పెద్ద బొద్దింకల్లో గుడ్లు పెట్టే లక్షణం తగ్గిపోతుంది.
పెప్పర్మింట్ ఆయిల్:
కొన్ని ఉప్పునీళ్ళు తీసుకుని అందులో కొన్ని చుక్కల పెప్పర్మింట్ ఆయిల్ కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే బొద్దింకలు ఇంట్లోంచి పారిపోతాయి.
బిర్యానీ ఆకు:
బిర్యానీ ఆకులు బొద్దింకలను చంపలేవు. కాకపోతే మీ ఇంట్లో దాక్కున్న బొద్దింకలను ఇవి బయటకు వచ్చేలా చేస్తాయి. బిర్యానీ ఆకులను నలిపేసి బొద్దింకలు నివాసముండే ప్రాంతాల్లో వేసి అవి బయటకు రాగానే స్పే చేసి వాటిని చంపేయండి.