LOADING...
Karthika Masam Snanam: కార్తీక మాసంలో స్నానం విధానం,నియమాలు, ఫలితాలు
కార్తీక మాసంలో స్నానం విధానం,నియమాలు, ఫలితాలు

Karthika Masam Snanam: కార్తీక మాసంలో స్నానం విధానం,నియమాలు, ఫలితాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

కార్తీక మాసంలో స్నానం చేయడం ద్వారా సమస్త శుభాలు, సుఖసంతోషాలు పొందవచ్చు. అయితే స్నానం సమయంలో కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. పండితుల ప్రకారం, ఈ నియమాలను పాటించడం చాలా అవసరం. కార్తీక స్నానం అంటే ఏమిటి? కార్తీక స్నానం అనగా, కార్తీక మాసంలో ఏ రోజైనా సూర్యోదయానికి అరగంట ముందు చేసే స్నానం. సూర్యోదయం అయిన తర్వాత చేసిన స్నానం కార్తీక స్నానంగా పరిగణించబడదు. చల్లని నీళ్లు ఉన్న చోట, స్వచ్చమైన నీళ్లతో స్నానం చేయడం మంచిది. ఆరోగ్య సమస్యలుంటే వెచ్చని నీళ్లను ఉపయోగించవచ్చు.

వివరాలు 

స్నానం చేయడానికి ప్రామాణిక స్థలాలు: 

నది, చెరువు, బావి దగ్గర.. ఇవి అందుబాటులో లేకపోతే ఇంట్లో కూడా స్నానం చేయవచ్చు. ఎక్కడైనా స్నానం చేస్తున్నా, దానికి కార్తీక దామోదర ప్రీతర్థ్యం అనే భక్తి భావనతో చేయాలి. స్నానం చేసే విధానం: అలాగే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ కలిపి స్నానం చేయాలి. స్నానం సమయంలో మూడుసార్లు "గోవిందా, గోవిందా, గోవిందా.. పుండరీకాక్ష" అని మంత్రపఠనం చేయాలి. నది వద్ద స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడూ వస్త్రం ధరించి స్నానం చేయాలి. మగవాళ్లైతే పైపంచ చివరి భాగంలో బొటన వేలు, చూపుడు వేలు తో కింద నీటిని నెరపాలి. ఆడవాళ్లు అయితే చీర చెంగు చివరలో బొటన వేలు,చూపుడు వేలు తో నీటిని ఒడ్డున వదిలాలి

వివరాలు 

స్నానం తరువాత: 

తడి వస్త్రాలను పిండేసి, పొడి వస్త్రాలు ధరించి ఇంటికి వెళ్లాలి. నది లేదా చెరువులో స్నానం చేసిన తర్వాత తడి వస్త్రాలతో ఇంటికి రాకూడదు; ఇది దోషం. సాధ్యమైనంత తెల్లటి వస్త్రాలు ధరించాలి. ఎరుపు లేదా గంజిపెట్టిన వస్త్రాలు ధరించి పూజలు చేయకూడదు. సమయం: సాయంకాలం సూర్యాస్తమయం అయ్యే ముందు మాత్రమే స్నానం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత సాయంకాలం స్నానం చేయకూడదు. ఈ అన్ని నియమాలు పాటిస్తూ, భక్తి భావనతో స్నానం చేస్తే, కార్తీక స్నానం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది.సమస్త శుభాలు లభిస్తాయి.