Page Loader
జెలసీని దూరం చేసుకోవాలనుకుంటే సాయం చేసే టిప్స్ ఇవే 
జెలసీని దూరం చేసే టిప్స్

జెలసీని దూరం చేసుకోవాలనుకుంటే సాయం చేసే టిప్స్ ఇవే 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 23, 2023
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

పక్కన వాళ్ళను చూసి ప్రతీ ఒక్కరికీ జెలసీ కలుగుతుంది. అదొక భావోద్వేగం. బాధ వస్తే ఏడ్చినట్టు, అవతలి వాళ్ళు మనకంటే బాగుంటే అసూయపడటం అన్నమాట. ఏది ఎక్కువైనా మంచిది కాదంటారు. అసూయ కూడా అంతే, అసూయ ఎక్కువైతే మీ మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. కోపం, నిరాశ పెరిగిపోతాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే జెలసీని దూరం చేసుకోవాలి. దీనికోసం ఎలాంటి టిప్స్ పనిచేస్తాయో చూద్దాం. కృతజ్ఞతగా ఉండండి: మీకు ఏమైతే ఉందో, ఎంతైతే ఉందో, దాన్ని సంపాదించడానికి మీకెంత టైమ్ పట్టిందో గుర్తు చేసుకుని, మీరు పడ్డ కష్టానికి ఫలితంగా ప్రస్తుతం ఏదైతే ఉందో అది వచ్చిందని సంతోషపడి మీ జీవితానికి కృతజ్ఞతగా ఉండండి.

Details

విజయాన్ని తెలుసుకుంటే జెలసీ దూరం 

పోలికలు అస్సలు వద్దు ఇతరులతో పోల్చుకున్నప్పుడే జెలసీ కలుగుతుంది. మీరు వేరు, వాళ్ళు వేరు.. మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు సాధించిన విజయాలు, మీరు పెట్టుకున్న లక్ష్యాలు.. ఇవన్నీ మీకూ వాళ్ళకూ విభిన్నంగా ఉంటాయి. అనవసరంగా వాళ్లతో మిమ్మల్ని పోల్చుకుని మీ టైం వేస్ట్ చేసుకోవడం వృధా. దానికన్నా మీకు తెలిసిన పనిని మరింత వైవిధ్యంగా చేయడం, దానిలో మరింత నైపుణ్యం పెంచుకోవడం మంచిది. విజయాన్ని అర్థం చేసుకోవాలి విజయం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. కొంతమందికి కారు, బంగ్లా ఉంటేనే విజయం. ఇంకొంతమందికి విజయం అంటే వేరే ఏదో ఉంటుంది. అసలు మీ దృష్టిలో విజయం అంటే ఏంటో తెలుసుకోండి.

Details

అణచివేస్తే ఆరోగ్యానికి హానికరం

అసూయను అణచవద్దు అసూయతో ఉండరాదు అన్నారని చెప్పి దాన్ని అణచాలని ట్రై చేయకూడదు. అలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. అయితే, దాన్ని అర్థం చేసుకొని, అది మనకు అవసరమా కాదా అన్నది ఆలోచించి పక్కన పెట్టేయడం మంచిది. మీ విలువ తెలుసుకోండి మీ స్నేహితుడికి మీకంటే ఎక్కువ మార్కులు వచ్చినా, మీ పక్కింటి వాళ్ళు విదేశాలకు విహారానికి వెళ్లినా, నీ పక్కనున్న కొలీగ్ కి నీకంటే ఎక్కువ శాలరీ వచ్చినా నీ వ్యాల్యూ తగ్గిపోదు. వాళ్లకు వచ్చిన గుర్తింపులన్నీ ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుందని గుర్తుంచుకోండి.