వర్షాకాలంలో చర్మ సంరక్షణకు చిట్కాలు.. మీ చర్మం పదిలం
వర్షాకాలంలో సాధారణంగా చర్మం కొంత అసౌకర్యానికి గురవుతుంది. ప్రత్యేకించి చర్మం పొడిబారడం వంటిది ఇబ్బంది పెడుతుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, వర్షాకాలంలో తేమ పెరుగుతుంది. దీంతో చర్మ సంరక్షణ సవాళ్లు ఎదురవుతాయి. మీ చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుకోవాలంటే ఈ బ్యూటీ చిట్కాలు పాటించండి. సంతోషకరమైన చర్మాన్నిసొంతం చేసుకోండి. వానాకాలంలో తేమ పెరగడంతో మొటిమలు, జిడ్డు, ఫంగల్ ఇన్ఫెక్షన్‌లకు దారితీసే అవకాశం ఎక్కువ. కనుక చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రాథమిక మార్పులో సబ్బును నిలిపేయాల్సి వస్తుంది. ఇందుకు బాడీ వాష్‌ను ఎంచుకోవడం ఉత్తమంగా నిపుణలు చెబుతున్నారు.
సూర్యరశ్మి లేమి, మందుల దుష్ప్రభావాల వల్ల చర్మం పొడిబారొచ్చు
వర్షాకాలంలో చర్మం ఊడిపోవడం అంటే జిరోసిస్ క్యూటిస్ అనే వ్యాధి దరిచేరినట్టు. చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మెల్లాగ శరీర భాగాలకూ వ్యాపించడంతో ఎక్స్‌ఫోలియేటివ్ డెర్మటైటిస్ పెరుగుతుంది. ఫలితంగా తామర లేదా సోరియాసిస్‌కు దారితీస్తుంది. సూర్యరశ్మి లేమి, కొన్ని మందుల దుష్ప్రభావాలు వంటివి సైతం వీటికి కారకాలు కావొచ్చు. కొన్నిసార్లు హైపోథైరాయిడిజం కూడా కావొచ్చు. ఇందుకు తగినంత థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత కారణంగా చర్మం పొట్టు ఊడిపోవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వల్ల చర్మం పొట్టులేచిపోతుంది. చాలా వరకు వాతావరణ మార్పులు, లేదా వర్షాకాలం సీజనల్ అలెర్జీలు అయితే చర్మ సమస్యలను పరిష్కరించడం సులభం.
సబ్బు వాడకం తగ్గించాలి
సబ్బు వాడకం, శరీరం నుంచి తేమను తొలగించి చర్మాన్ని పొడిగా మారుస్తుంది. అందువల్ల బాడీ వాష్ ప్రత్యామ్నాయంగా వినియోగించాలి. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. పొడి చర్మ సమస్యలకు చక్కటి మాయిశ్చరైజర్ వాడటం ప్రయోజనకరం. ఏడాది పొడవునా ఆకు కూరలను ఏదో ఓ రూపంలో స్వీకరిస్తుండాలి. అవి మీ చర్మ ఆరోగ్యానికి, సౌందర్యానికి మన్నికైనవి. మరోవైపు దుస్తుల ఎంపికలోనూ తగిన జాగ్రత్తులు తీసుకోవాలి. తేలికైన, శ్వాసక్రియకు అనుకూలమైన బట్టలనే ధరించాలి. అవసరం మేరకు లోషన్లను ఉపయోగించండి. మీకు ఫ్లాకీ స్కిన్ ఉంటే విటమిన్ B3, B7 గోలీలు వాడాల్సి ఉంటుంది. వీటితో పాటు, చర్మం పొడిబారితే తొలి దశ చికిత్సల్లో కలబంద అద్భుతంగా పనిచేస్తుందని చర్మవ్యాధి నిపుణుడు డా.నవనీత్ హారోర్ వెల్లడించారు.