
Hyderabad: ఈ సారి హైదరాబాద్'లో ఎముకలు కొరికే చలి.. అలా ఇలా కాదంట..!
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాలం ముగిసిపోయింది, కానీ ప్రస్తుతం హైదరాబాద్‌లో వాయుగుండం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.
మరికొన్ని రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని భావిస్తున్నారు. చలికాలం ఎంట్రీతోనే వాతావరణ శాఖ ఒక హెచ్చరికను విడుదల చేసింది.
ఈసారి హైదరాబాద్‌లో చలికి తీవ్రమైన ప్రభావం ఉండనుందని, అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వవచ్చని వారు తెలిపారు.
2024 జనవరి సీజన్లోనే హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోయింది.
ఈసారి ఆ స్థాయికి కంటే తక్కువగా, అంటే 5 లేదా 6 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతలు నమోదవ్వవచ్చు అని భారతీయ వాతావరణ విభాగం అంచనా వేసింది.
వివరాలు
ఆదిలాబాద్ జిల్లాలో 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
అయితే, అక్టోబరు-నవంబర్ మధ్య కాలంలో ఏర్పడే లా నినా పరిస్థితుల కారణంగా, ఈ ఏడాది శీతాకాలంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని ఐఎండీ అంచనా వేసింది.
ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది చలి వణికిస్తుందని పేర్కొంది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రికార్డ్స్ ప్రకారం, లా నినా ప్రభావంతో గతంలో తెలంగాణలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
2022లో చలికాలంలో, రాజేంద్రనగర్, పటాన్ చెరువు వంటి ప్రాంతాల్లో 8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వివరాలు
పొగమంచు వల్ల వాహనదారులకు ఇబ్బందులు
ఈ ఏడాది శీతాకాలంలో కూడా హైదరాబాద్‌లో 5 లేదా 6 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఏండీ తెలిపింది.
మధ్య, తూర్పు పసిఫిక్‌లో సాధారణ సముద్ర ఉష్ణోగ్రతల కంటే వాతావరణం చల్లగా ఉంటుందని, దీని ప్రభావంతో తెలంగాణతో పాటు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చలికాలం అధికంగా నమోదవుతోందని ఐఏండీ పేర్కొంది.
ఈ ఏడాది శీతాకాలం సవాల్‌గలదని అంచనా వేసిన వాతావరణ శాఖ, తక్కువ ఉష్ణోగ్రతల నమోదుతో ఉదయాన్నే పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
పొగమంచు వాహనదారులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది.