Mouth Cancer: ఈ అలవాట్లు ఉంటే నోటీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. ఏం చేయాలి?
ఈ వార్తాకథనం ఏంటి
నోటి క్యాన్సర్ కేసులు ఈ మధ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతేడాది లక్షలాది మంది ఈ క్యాన్సర్ భారీన పడుతున్నారు.
ముఖ్యంగా భారత్‌లో నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణం కొన్ని ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లు కావడం గమనార్హం.
ఇలాంటి అలవాట్లు ఏమిటి, వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. మద్యం సేవించడం
మద్యపానం అధికంగా చేయడం వల్ల నోటి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఇది పరిగణనలోకి తీసుకోదగ్గ విషయం. ముఖ్యంగా, ధూమపానం, మద్యం రెండూ చేసే వారికి ఈ రిస్క్ మరింత పెరుగుతుంది.
Details
2. ధూమపానం
సిగరెట్లు, బీడీలు, సిగార్‌లు తాగడం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.
ధూమపానం చేసే వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం సుమారు పది రెట్లు అధికంగా ఉంటుంది.
మానవ శరీరంలో ఈ అలవాటు నోటికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ధూమపానం చేస్తున్న వారు అప్పుడప్పుడు వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
3. పొగాకు నమలడం
పొగాకు నమిలే అలవాటు కూడా నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా ఉంటుంది. ఇందులోని హానికర రసాయనాలు నోటిలో క్యాన్సర్ కణాలను పెంచే ప్రమాదాన్ని కలిగిస్తాయి.
Details
4. అసురక్షిత శృంగారం
హ్యూమన్ పాపిల్లొమా వైరస్ (HPV) కారణంగా అసురక్షిత శృంగారం ద్వారా నోటి క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది.
ముఖ్యంగా ముద్దులు లేదా ఓరల్ సెక్స్ చేసే సమయంలో ఈ ప్రమాదం అధికంగా ఉంటుంది. సురక్షిత చర్యలు తీసుకోవడం అవసరం.
5. పోషకాహార లోపం
పోషకాలు లేని ఆహారం నోటి క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కూరగాయలు, పండ్లు వంటి పౌష్టిక ఆహారాన్ని ప్రతిరోజు ఆహారంలో చేర్చడం ద్వారా ఈ రిస్క్ తగ్గించవచ్చు.
Details
నోటి క్యాన్సర్ ముఖ్య లక్షణాలు
నోటి లోపల గరుకుగా ఉండే గాయాలు లేదా మచ్చలు
నోటిలో లేదా పెదాల నుంచి రక్తస్రావం
ఆహారం నమలడంలో లేదా మింగడంలో ఇబ్బందులు
సుదీర్ఘ కాలం నోటి నుంచి దుర్వాసన