LOADING...
motivation: యవ్వనంలో ఈ నాలుగు తప్పులు చేస్తే… జీవితాంతం పశ్చాత్తాపమే!
యవ్వనంలో ఈ నాలుగు తప్పులు చేస్తే… జీవితాంతం పశ్చాత్తాపమే!

motivation: యవ్వనంలో ఈ నాలుగు తప్పులు చేస్తే… జీవితాంతం పశ్చాత్తాపమే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రహ్మజ్ఞాని, రాజకీయ శాస్త్రవేత్తగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడు జీవితాన్ని బాగుగా తీర్చిదిద్దుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నదానిపై విలువైన ఉపదేశాలు అందించాడు. ఆయన చెప్పిన మార్గదర్శకాలు ఈనాటి యువతకు కూడా మార్గసూచికలుగా నిలుస్తున్నాయి. చాణక్యుడు ప్రత్యేకంగా యవ్వనంలో జరగకూడని తప్పుల గురించి వివరించారు. ఆ తప్పులు తెలియక జరిగితే జీవితాంతం పశ్చాత్తాపంలో మగ్గాల్సి వస్తుందని హెచ్చరించారు.

Details

 1. సమయాన్ని వృథా చేయవద్దు

యవ్వనంలో సమయాన్ని వినోదాల కోసం కేటాయించకూడదని చాణక్యుడు స్పష్టంగా చెప్తాడు. ఇది జీవితం మొత్తానికీ ప్రాతిపదిక. నీ చేతులు శ్రమించగలవు, మెదడు చురుకుగా ఉంటుంది. ఇదే సమయం మంచి పనులు చేయడానికి, సాయపడడానికి. ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తే, జీవితంలో చీకట్లు తప్పవు. 2. డబ్బును వృథా చేయొద్దు అందంగా దుస్తులు, పార్టీల కోసం ఖర్చు చేస్తూ ఉంటే.. మిగిలిన జీవితాన్ని పేదరికంలో గడపాల్సి వస్తుంది. డబ్బు ఖర్చు చేసే ముందు సారవంతమైన ఆలోచన అవసరం. యవ్వనంలో అజాగ్రత్తగా ఖర్చు చేస్తే, వృద్ధాప్యంలో చిత్తశుద్ధి, మనశ్శాంతి దూరమవుతాయని చాణక్యుడు హెచ్చరిస్తాడు.

Details

3. కెరీర్ పట్ల నిర్లక్ష్యం వద్దు 

యవ్వనమే జీవితం బాగుపడే దశ. కెరీర్‌ని పక్కన పెట్టి సరదాల్లో మునిగిపోతే, అది జీవితాంతం నిండా బాధించే విషాదం అవుతుంది. చాణక్యుడు సూచన. కెరీర్ మీద ఇప్పుడే దృష్టి పెట్టు, లేదంటే నువ్వు చూసే కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి.

Advertisement

Details

4. తప్పుడు స్నేహం నుండి దూరంగా ఉండు

చాణక్యుడు చెప్పిన ప్రకారం యవ్వనంలో తప్పుడు స్నేహితులను ఎంచుకుంటే జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే. కాబట్టి నిన్ను ఉత్తమంగా ప్రభావితం చేసే వారితోనే స్నేహం కొనసాగించమని ఆయన సూచిస్తారు. మంచి పరిచయాలు జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. చాణక్యుని సూచనలు నేడు కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. యవ్వనాన్ని ఎలా గడపాలి? ఏ తప్పులు చేయకూడదు? అనే దానిపై ఆయన చూపిన దారి మన జీవితం మొత్తం వెలుగుల బాటగా మారుతుంది.

Advertisement

Details

Advertisement