గుండె పదిలంగా ఉండాలంటే పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకోవాలి
ఈ కాలంలో పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకొనే వారి సంఖ్య చాలా తక్కువ. మార్కెట్లో దొరికే పెసరపప్పును పైన పొట్టు తీసి పాలిష్ చేసి అమ్ముతుంటారు. అయితే పెసరపప్పులో పొట్టు ఉన్నదాన్ని ఎంచుకుంటే ఎక్కువ ప్రయోజనాలు అందనున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. పెసరపప్పులో ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. సూపర్ మార్కెట్‌లో కూడా పొట్టు తీసిన పెసరపప్పుతో పాటు, పొట్టు తీయని పెసర పప్పు దొరకుతుంది. పొట్టు తీయని పెసర పప్పును రాత్రంతా నానబెడితే ఉదయానికి మొలకలు వస్తాయి. వాటిని తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
రక్తపోటు, ఊబకాయం సమస్యలకు చెక్
ఇక పెసరపప్పుతో అనేక రకాల వంటకాలను కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు తింటే కొవ్వు కూడా పెరగదు. అలాగే శరీరానికి ఐరన్ అందుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం లక్షణాలు తగ్గుతాయి. కొలస్ట్రాల్ అధికంగా ఉన్నవారు పెసరపప్పును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పొట్టు ఉన్న పెసరపప్పుతో చేసిన వంటకాలను తింటే గుండె జబ్బుల భారీన పడే అవకాశం తగ్గుతుంది. వీటిని తింటే ఊబకాయం, రక్తపోటు సమస్యల బారీన పడకుండా గుండెను రక్షించుకోవచ్చు.