Vinay Hiremath: చిన్న వయసులోనే వేల కోట్ల రూపాయలు సంపాదించా.. ఇప్పుడింక ఏం చేయాలో తెలియట్లేదు..!
ఈ వార్తాకథనం ఏంటి
మన జీవితంలో చాలా మంది తమ అవసరాలను తీర్చుకోవడానికి, ఇష్టపడే విధంగా జీవించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
కొందరు త్వరగా తమ లక్ష్యాన్ని చేరుకుంటారు, మరికొందరు సాధించుకునే ప్రయత్నంలోనే చివరి అంకానికి చేరుకుంటారు.
కానీ ఓ యువ వ్యాపారవేత్తకు మాత్రం చాలా విచిత్రమైన పరిస్థితి ఎదురైంది.
ఆయన చిన్న వయసులోనే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, కానీ ఇప్పుడు తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఈ వ్యక్తి దాదాపు 35 ఏళ్ల వయస్సులోనే పేదరికం నుండి బయటపడిపోయి, భారీ మొత్తంలో సంపాదించిన వ్యక్తి అయిన వినయ్ హిరేమత్.
వివరాలు
విక్రయం ద్వారా ఆయన 975మిలియన్ డాలర్ల సంపాదన
వినయ్ హిరేమత్ భారత సంతతికి చెందిన టెక్ వ్యాపారవేత్త,అతను"లూమ్"అనే టెక్నాలజీ సంస్థను స్థాపించి,అట్లాసియన్ సంస్థకు అమ్మాడు.
ఈవిక్రయం ద్వారా ఆయన 975మిలియన్ డాలర్ల(8 వేల కోట్ల రూపాయల)సంపాదన సాధించారు.
అయితే,ఈ ఇంత సంపదను పొందిన తరువాత, వినయ్ తన జీవితంపై ఆలోచనలు చేయడం ప్రారంభించారు.
అతను ఇటీవల తన బ్లాగ్‌లో ఓ సంచలన పోస్ట్ పెట్టాడు,''నేను ధనవంతుడినయ్యా,కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నాకు కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ ఉందని అనుకుంటున్నా, కానీ లోపల ఒక సందిగ్ధతలో ఉన్నాను.జీవితంపై నాకు సానుకూలమైన ఆలోచనలు లేవు.ఈపోస్ట్ పెట్టడం ద్వారా నేను ఎవరి సానుభూతిని పొందాలనుకోలేదు. నా దృష్టిలో ఈ సందేశం రాస్తున్నది కూడా నాకు స్పష్టంగా అర్థం కావడం లేదు''అని చెప్పాడు.
వివరాలు
అభద్రతాభావం వల్ల ఆమెతో విడిపోయా..
గతేడాది తన కంపెనీని అమ్మిన తర్వాత వినయ్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ప్రపంచం ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారట.
కానీ ఈ ప్రయాణాలు, అనుభవాలు కూడా అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు.
ఈ పరిస్థితిలో తనకున్న అభద్రతాభావం వల్ల ఆమెతో విడిపోయానని అన్నారు.
ఆమె ఈ పోస్ట్ చదవడం జరిగితే, ''నేను నీకు కావాల్సిన విధంగా ఉండలేకపోయానని, నువ్వు ఇచ్చిన అనుభూతులకు కృతజ్ఞతలు'' అని వినయ్ పేర్కొన్నాడు.
వివరాలు
చర్చనీయాంశంగా వినయ్ చేసిన పోస్ట్
తన సంస్థను కొనుగోలు చేసిన అట్లాసియన్ సంస్థ, వినయ్‌కు 60 మిలియన్ డాలర్ల ప్యాకేజీతో పనిచేసే అవకాశం ఇచ్చింది.
అయితే ఈ అవకాశాన్ని కూడా ఆయన తిరస్కరించారు. అనంతరం, రోబోటిక్ సంస్థను స్థాపించాలని చేసిన ప్రయత్నం కూడా నిరాశకరంగా మారింది.
ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి ప్రముఖులతో పనిచేయాలన్న ఆయన కోరిక కూడా నెరవేరలేదు.
ప్రస్తుతం ఆయన హవాయీ ద్వీపంలో ఫిజిక్స్ నేర్చుకుంటున్నారని, తన శక్తిని ఇతర అంశాలపై కేంద్రీకరిస్తున్నట్లు చెప్పారు. అయితే వినయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.