
International Translation Day: నేడు అంతర్జాతీయ అనువాద దినోత్సవం.. దాని ప్రాముఖ్యత, విశేషాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
విభిన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒకరినొకరు కనెక్ట్ అవడం, పరస్పరం సంభాషించడానికి అనువాదం ముఖ్యమైన సాధనంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటారు, అనువాదకుల కృషి, అంకితభావాన్ని గుర్తిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బైబిల్‌ను లాటిన్‌లోకి అనువదించిన సెయింట్ జెరోమ్ జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30న నిర్వహిస్తారు.
సెయింట్ జెరోమ్‌ను అనువాదకుల పరిరక్షకుడిగా పరిగణిస్తారు, ఆయన చేసిన లాటిన్ బైబిల్ అనువాదం వల్గేట్ పేరుతో ప్రసిద్ధి పొందింది.
ఈ రచన ఆయన విశాలమైన భాషా పరిజ్ఞానం, పాండిత్యానికి ఉదాహరణగా నిలుస్తుందని చెబుతారు.
ఈ దినోత్సవాన్ని జరపడం అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య (ఎప్‌ఐటీ) 1953లో ప్రారంభించింది.
వివరాలు
రాజకీయ రంగంలో అనువాదం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది
1991లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని ఎఫ్‌ఐటీ ప్రతిపాదించగా, 2017లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని అధికారికంగా గుర్తించింది.
అనువాదకులు ప్రపంచ శాంతి,సహకారంలో కీలక పాత్ర పోషిస్తారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
అనువాదం ఆలోచనలు, భావజాలాలు, సంస్కృతుల మార్పిడికి ఒక వారధిగా నిలుస్తుంది.
సాహిత్యం, శాస్త్రం, వ్యాపారం, రాజకీయ రంగాలలో అనువాదం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
ప్రపంచ వాణిజ్యం, దౌత్య సంబంధాలు,శాస్త్రీయ పరిశోధనలు సజావుగా సాగాలంటే అనువాదకుల సహకారం అవసరమవుతుంది.
వివిధ భాషలలో ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో,సంబంధాలు నెలకొల్పడంలో అనువాదకులు కీలక పాత్ర పోషిస్తారు.
అనువాదం లేకపోతే, షేక్స్‌పియర్, టాల్‌స్టాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్‌చంద్ వంటి ప్రముఖ రచయితల రచనలు ప్రపంచ వ్యాప్తంగా చదవబడేవి కాదని అనడంలో సందేహం లేదు.