International Women's Day: మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లింగ సమానత్వం,లింగ వివక్షకు వ్యతిరేకంగా నిరసన, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోను అభిశంసించాలని డిమాండ్ చేస్తూ మహిళల హక్కులకు మద్దతుగా ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. మార్చి 8, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజును మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గౌరవించడం కోసం అంకితం చేయబడింది. మహిళా దినోత్సవం లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి కూడా ప్రయత్నిస్తుంది. మొదటిసారిగా అమెరికాలో ఫిబ్రవరి 28, 1909న న్యూయార్క్ నగరంలో జరుపుకున్న ఈ కార్యక్రమం కార్యకర్త థెరిసా మల్కీల్ సూచన మేరకు నిర్వహించబడింది.
ఈ సంవత్సరం థీమ్ ఇదే..
దీని తరువాత,ఆగష్టు1910లో,డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో క్లారా జెట్‌కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. వార్షిక 'మహిళా దినోత్సవాన్ని' ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. మరుసటి సంవత్సరం మార్చి 19న,ఆస్ట్రియా-హంగేరీ,డెన్మార్క్, జర్మనీ,స్విట్జర్లాండ్‌లలో మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి,అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. అయితే, ఐక్యరాజ్యసమితి 1975లో ఈ దినోత్సవాన్ని గుర్తించింది.1977 నాటి UN జనరల్ అసెంబ్లీ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఇలా మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.'మహిళల్లో పెట్టుబడి పెట్టండి: పురోగతిని వేగవంతం చేయండి' అనేది ఐక్యరాజ్యసమితిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఈ సంవత్సరం థీమ్.