ఇనుప కడాయిలో వంట చేసుకుంటే, శరీరంలో ఐరన్ కొరతే రాదంట
ఇనుప కడాయిని వందల ఏళ్ల నుంచి భారతీయ వంటకాలకు ఉపయోగిస్తున్నారు. అయితే ఇనుముతో కూడిన ప్యాన్ వాడటం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ లెవెన్స్ అందుతాయని నిపుణులు చెబుతుండటం తెలిసిందే. నాన్ స్టిక్ కడాయి కంటే ఇనుప పాత్రలు మన్నికైనవి, బలమైనవి. ఐరన్ కడాయిలో వంట చేస్తే ఆహారంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో నాన్ స్టిక్ ప్యాన్‌లనే చాలా మంది ఉపయోగిస్తున్నారు.కానీ అవి విషపూరిత, రసాయన పూతతో ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి.దీంతో ఈ మధ్య కాలంలోనే ప్రజలు దీని ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు. ఇనుము మన శరీరంలో కీలకమైన పోషకం. ఇది కణాలను అభివృద్ధి చేయడంలో సహకరిస్తుంది. చర్మం, జుట్టుతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని ఇనుము సంరక్షిస్తుంది.
ఇనుము కడాయిలో వండటం వల్ల శరీరంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది
శరీరంలో ఐరం తగినంత లేకపోతే అలసట, నిద్రలేమి, నిస్సత్తువ వంటి వాటికి దారితీస్తుంది. అందుకే, ఆహారంలో ఐరన్-రిచ్ ఫుడ్స్‌ను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. శరీరంలో ఇనుము రావాలంటే పలు రకాల ఐరన్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు ఇనుప పాత్రలను విరివిగా వినియోగించాలని ప్రముఖ పోషకాహార నిపుణుడు రుజుతా దివేకర్ అన్నారు. ఇనుము కడాయిలో వండటం వల్ల శరీరంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుందని వివరించారు. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్‌లో ఇటీవలే ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. అయితే ఓ 20 రకాల ఆహారాలను ఇనుము పాత్రల్లో వండారు. ఆ తర్వాత వాటి ఫలితాలను పరిశీలించారు. ఐరన్ కడాయిలో వండినప్పుడు ఆహారంలో 90 శాతానికిపైగా ఇనుము పోషకాలున్నట్లు నిర్థారించారు.
ఇనుము పాత్రల వాడకంలో చేయాల్సినవి, చేయకూడనివి ఇవే
1. నిమ్మ, వెనిగర్ వంటి పదార్థాలు లేదా ఆమ్ల పదార్థాలను వండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇనుప కుండల్లో ఎసిడిక్ పదార్థాలను వండితే, ఆహారం చెడిపోతుంది. 2. వంట చేసిన తర్వాత ఆహారాన్ని ఇనుప పాత్రలో ఉంచకూడదు. ఐరన్ పాన్ ఎక్కువసేపు వేడిగా ఉంటుంది కనుక స్టవ్ ఆఫ్ చేసినా ఆహారం ఉడుకుతూనే ఉంటుంది. దీంతో పోషకాలు నశిస్తాయి. 3. ఎల్లప్పుడూ తవాను వాడుకను సిద్దంగా ఉంచుకోవాలి. లేదంటే ఆహారం వండుతున్న క్రమంలో ప్యాన్ కే అతుక్కుపోయే ఛాన్స్ ఉంది.బాణలిపై కొద్దిగా నూనె వేసి బాగా వేడి చేస్తే సరి. 4. ఐరన్ వంటసామాగ్రిని శుభ్రపరిచే క్రమంలో హార్డ్ స్క్రబ్‌ని కాకుండా సున్నితంగా తోముకోవాలని సూచిస్తున్నారు.తవాపై ఉప్పు, బేకింగ్ సోడా వేసి శుభ్రంగా కడగాలి.