మీకు స్వార్థం ఉందా? ఎలాంటి విషయాల్లో స్వార్థం మంచిదో తెలుసుకోండి
మారుతున్న ప్రపంచంలో స్వార్థంగా ఉన్నవారే మంచి జీవితాన్ని పొందుతారన్న మాటను ఎక్కువ మంది నమ్ముతున్నారు. కాకపోతే బయటకు మాత్రం మాకెలాంటి స్వార్థం లేదని, అసలు స్వార్థం ఉండకూడదని చెప్తూ కొద్దిగా స్వార్థంగా ప్రవర్తించిన వాళ్ళను వింతగా చూస్తుంటారు. మరి నిజంగా స్వార్థం ఉండకూడదా? ఎలాంటి విషయాల్లో స్వార్థం మనకు మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. మీరు నిద్ర పోవాలనుకున్నప్పుడు: మీ శరీరం, మెదడు సరిగ్గా పనిచేయాలంటే సరైన నిద్ర అవసరం. మీ నిద్రని దూరం చేసే పనులు ఎవరైనా చెప్పినపుడు, అది మీ వల్ల కాదని చెప్పి హ్యాపీగా నిద్రపోయి మీ స్వార్థం మీరు చూసుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. ఫోన్ ని పక్కన పడేసి తెల్లారే వరకూ లేవకుండా హాయిగా పడుకోండి.
ఆఫీసు పనుల్లో స్వార్థం చూసుకోకపోతే మొదటికే మోసం
కేవలం తీసుకునే వాళ్ళతో: కొంతమంది ఉంటారు, వాళ్ళెప్పుడూ ఏదీ ఇవ్వరు. కేవలం మీ దగ్గరినుండి తీసుకుంటూనే ఉంతారు. ఇలాంటి వారితో స్వార్థంగా ఉంటే నష్టమేం లేదు. బిజినెస్ అవర్స్ దాటాక పనిచేయమనే వాళ్ళతో: బిజినెస్ అవర్స్ అనేవి ఉన్నవి బిజినెస్ చేయడానికే. ఆ తర్వాత కూడా అవతలి వాళ్ళు పని చేయించుకుంటున్నారంటే అది వాళ్ళ స్వార్థం. అటువంటి టైమ్ లో మీరు మీ స్వార్థం చూసుకుని మీ సమయాన్ని మీ ఫ్యామిలీతో గడపండి. ఆరోగ్యం బాలేకపోతే: మీకు జ్వరం వచ్చి పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా పని చేసిపెట్టమని మిమ్మల్ని అడిగితే మీరు మూ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి సెల్ఫిష్ గా ఉండడం మంచిదే. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం.