
Black Neck In Winter: శీతాకాలంలో మెడ నల్లగా మారిందా.. మెరవడానికి ఈ చిట్కాలను పాటించండి!
ఈ వార్తాకథనం ఏంటి
చాలామందికి ముఖం తెల్లగా ఉన్న మెడ మాత్రం నల్లగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వల్ల వారు చాలా ఇబ్బంది పడుతుంటారు.
ముఖ్యంగా ఈ సమస్య చలికాలంలో ఎక్కువగా సంభవిస్తుంది.
మెడ నలుపు రంగు మారడానికి కారణాలు ఏమిటి? ఈ సమస్యను తగ్గించడానికి ఏ టిప్స్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంతమంది ఎక్కువగా ఎండలో పనిచేయడం వల్ల మెడ దగ్గర నలుపు వచ్చే అవకాశం ఉంది. మెడ ప్రాంతంలో ఎక్కువగా మృత కణాలు పేరుకుపోవడం వల్ల కూడా అక్కడ నలుగు మారే ఛాన్స్ ఉంది.
మెడ దగ్గర మృత కణాలు పేరుకుపోతే వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి. దీని కోసం పాలల్లో కాస్త ఓట్ మీల్ కలిపి స్క్రబ్ చేసుకోవాలి.
Details
ఈ చిట్కాలను పాటిస్తే మెడ దగ్గర చర్మం మృదువుగా మారుతుంది
లేకపోతే పెరుగులో కాస్త శనగ పిండి వేసి స్క్రబింగ్ చేసుకొని చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు అయినా చేయాలి.
లేదా రెండు చెంచాల శనగ పిండిలో ఒక టీ స్పూ పసుపు, అర టీ స్పూన్ నిమ్మరసం, కాస్త రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా తయారు చేసి 15 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
పలు ఆస్పత్రుల్లో మెడ నలుపును తగ్గించడానికి చికిత్సలు చేయించుకోవచ్చు.
ముఖం పిగ్మంటేషన్, టానింగ్ కోసం వాడే మంచి క్లెన్సర్లను కూడా మెడకు కూడా రాసుకుని క్లెన్స్ చేసుకోవచ్చు. దీంతో మెడ దగ్గర చర్మం మరింత మృదువుగా మారుతుంది.