Eating With Hands Benefits : ఆహారాన్ని స్పూన్ తినడం కంటే చేతితో తినడం ఉత్తమం.. ఎందుకంటే?
పురాతనం కాలం సంప్రదాయ పద్ధతిలో ఆహారాన్ని చేతులతో తినడం ఒకటి. మన పూర్వీకుల నుండి నేటి వరకూ చాలా మంది చేతులతో ఆహారం తినడం వెనుక చాలా ఆరోగ్య రహాస్యాలున్నాయని నమ్ముతారు. మనం చేతులతో తినేటప్పుడు ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ఇది పేగులకు,శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది. ఇప్పుడు చేతులతో తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. ఆయుర్వేద ప్రకారం ప్రతి వేలికి కొంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. బొటనవేలు అగ్ని(అగ్ని),చూపుడు వేలు వరుణ (వాయువు), మధ్య వేలు ఆకాష్ (ఆకాశం), ఉంగరపు వేలు పృథ్వీ (భూమి), చిటికెన వేలు జలం (నీరు)తో కలుపుతుంది. చేతులతో తినేటప్పుడు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సాయపడుతుంది.
నేలపై కూర్చొని భోజనం చేయడం మంచిది
ఇక నేలపై కూర్చొని చేతులతో భోజనం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తింటే శరీరానికి మంచిదని సాంప్రదాయమని నమ్ముతారు. సైన్స్ ప్రకారమైతే చేతులతో తినడం జిర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే చేతుల్లో హానిచేయని బ్యాక్టీరియా దాగి ఉంటుంది. అదే విధంగా రక్త ప్రవాహాన్ని పెంచి, కండరాలకు శిక్షణలాగా ఉపయోగపడుతుంది. చేతులతో ఆహారాన్ని తిన్నప్పుడు నరాల చివరలు ఆహారం ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. ముఖ్యంగా ఆహారం ఎంత వేడిగా లేదా చల్లగా ఉంటుందో మన మెదడకు సమాచారాన్ని పంపుతుంది. కావున ఇప్పటి నుంచి చేతులతో ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం ప్రారంభించండి