Sankranti: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగే ముక్కనుమ విశేషాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది.
కొన్నిచోట్ల భోగి, సంక్రాంతి, కనుమ అని మూడురోజులు జరుపుకుంటే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముక్కనుమ అని నాలుగవ రోజు కూడా జరుపుకుంటారు.
కనుమ రోజు వ్యవసాయ దారులు తమకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులను బాగా అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు కూడా నిర్వహిస్తారు.
కానీ జంతుహింస సరికాదని ప్రభుత్వాలు వీటిని నిషేధించాయి. కనుమ రోజున మినుము తినాలని దానిలోని ఐరన్ శరీరానికి మేలు చేస్తుందని అంటారు.
ఇక కనుమ రోజున వివిధ పని ముట్లతో పనిచేసేవారు, రైతులు వారి వ్యవసాయ పనిముట్లకు కనుమ రోజున కడిగి శుభ్రం చేసుకుని, పూజలు చేస్తారు.
Details
సంక్రాంతి సంబరాల్లో ముక్కనుమ రోజు ఏం చేస్తారంటే
భోగి, సంక్రాంతి రోజుల్లో మాంసాహారం ముట్టుకోరు. తర్వాతి రోజైనా కనుమ, ముక్కనుమ రోజుల్లో ఎవరికి నచ్చిన మాంసాహారాన్ని వాళ్ళు భుజిస్తారు.
నిజానికి కనుమ రోజు కూడా మాంసాహారాన్ని ముట్టుకోవద్దని కొంతమంది పండుతులు చెబుతున్నారు. ముక్కనుమతో సంక్రాంతి పండగ ముగుస్తుంది.
ఈరోజున గ్రామదేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి పూజలు చేస్తారు. అందువల్ల మాంసాహారాన్ని ఇష్టపడేవాళ్ళు తమకు ఇష్టమైన వంటకాలను చేసుకుని తింటారు.
అందుకే ముక్కల కనుమ, ముక్కనుమ అన్న పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం. ముక్కనుమ రోజు వాకిట్లో రథం ముగ్గు వేస్తారు.
దాన్ని పక్కింటి వారి వాకిట్లో రథం ముగ్గుతో కలిపేస్తూ ఊరు మొత్తాన్ని కలిపేస్తారు. సూర్యుడు ఉత్తరాయణం వైపు కదిలే గమనాన్ని గుర్తు చేస్తూ ఇలా రథంతో స్వాగతం పలుకుతారని చెబుతారు.