Healthy Recipe For Kids: చలికాలంలో పిల్లలకు ఉదయాన్నేఈ హెల్తీ డ్రింక్ ఇస్తే చాలా మంచిది
పిల్లలకు మంచి పోషకాలతో కూడిన ఫుడ్ పెట్టాలని తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే చలికాలంలో మా పిల్లలు ఏదీ పెడుతున్న తినడం లేదని పలువురు చెబుతున్నారు. అయితే అలాంటి వారి కోసం ఇలాంటి హెల్తీ డ్రింక్ ఇస్తే తప్పక తీసుకొనే అవకాశం ఉంటుంది. అంజీర్, బాదం రెండు ఆరోగ్యానికి మంచివైనా, వీటిని తినడానికి పిల్లలు ఇష్టపడరు. ఇంకా కొంతమంది కిడ్స్ పాలు తాగడానికి వెనకడుగు వేస్తారు. అలాంటి వారి కోసం అంజీర్ బాద్ మిల్క్ షేక్ చేస్తే లొట్టలు వేసుకొని తాగేస్తారు. ముఖ్యంగా ఈ మిల్క్ షేక్ ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది మంచి రుచినే అందించడే కాకుండా ఆరోగాన్ని కాపాడుతుంది. ఇక చలికాలంలో ఇమ్యూనిటీని పెరగడానికి సాయపడుతుంది.
చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా తాగచ్చు
ఇది చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా తాగచ్చు. ఈ రెసిపికి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు అంజీర్ - 2 కప్పులు బాదం పప్పులు - 10 అరటిపండు - 1 పాలు - 2 కప్పులు తేనె - రుచికి తగినంత ముందుగా అంజీర్, అరటి పండును రెండు ముక్కలుగా తరిగి బ్లెండర్ తీసుకోవాలి. అందులో అంజీర్, బాదం, అరటిపండ్లు వేసి బాగా బ్లెండ్ చేయాలి. తర్వాతి కొంచెం తెనె కలుపుకోవాలి. దాన్ని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయాలి. అంతే ఇక హెల్తీ, అంజీర్ బాదం మిల్క్ షేక్ రెడీ అయిపోంది.