2023 కేతు సంవత్సరం ఎలా అయ్యింది? కేతు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గ్రహాల్లో రాహువు, కేతువుల గురించి సాధారణంగా అందరికీ తెలుస్తుంటుంది. రాహువు కారణంగా జీవితంలో గందరగోళం ఏర్పడుతుందని జ్యోతిష్యం ప్రకారం చెబుతారు. కేతువు అనేది రాహువు నీడలాంటిది. అందువల్ల కేతువుతో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. 2023 సంవత్సరాన్ని కేతువు సంవత్సరమని పిలుస్తున్నారు. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం ప్రతీ గ్రహానికి ఒక సంఖ్య ఉంటుంది. కేతువు నంబర్ 7. ఇప్పుడు 2023లోని నంబర్లను కలిపితే(2+0+2+3=7) ఏడు వస్తుంది. అందుకే కేతువు సంవత్సరమని పిలుస్తున్నారు. కేతువు వల్ల అనవసర అలవాట్లు వ్యసనాలుగా మారే అవకాశం ఉంది. మరి దీని బారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. డా మధు కోటియా, కేతువు బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు.
వ్యసనాలకు దూరంగా ఉంటే కేతువు ప్రభావం తగ్గుముఖం
వ్యసనాలకు దూరం: మీ అలవాట్లు వ్యసనాలుగా మారకుండా చూసుకోండి. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీరు కొన్నింటిపై ఆధారపడుతుంటారు. అందుకే వారానికోసారి మిమ్మల్ని మీరు చెక్ చేస్తూ ఉండాలి. మంచి చేయండి: ఈ సంవత్సరం మీరు ఏ మంచి పని చేసినా అది మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వచ్చేస్తుంది. అందుకే వీలైనంత మటుకు మంచి చేస్తూ ఉండండి. బంధాల్ని బలపర్చుకోండి: కేతువు కారణంగా బంధాలు బలహీనం అయ్యే అవకాశం ఉంది. ఎవ్వరూ వద్దు ఒక్కడినే ఉంటాననే ఆలోచనలు వస్తుంటాయి. అటువైపు వెళ్ళకుండా బంధాలను బలపర్చుకునే ప్రయత్నం చేయండి. షార్ట్ కట్స్ వద్దు: ఏ పనిలో అయినా తొందరగా డబ్బులు రావాలని లేదా తొందరగా ఎదిగిపోవాలని అనుకోవద్దు. దానివల్ల బొక్కాబోర్లా పడే అవకాశమే ఎక్కువ.