
Jaggery Tea : బెల్లం టీ.. మహిళలకు స్పెషల్..ఆ సమయంలో నొప్పి నివారణి
ఈ వార్తాకథనం ఏంటి
బెల్లం టీ, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. చక్కెరకు బదులుగా దీన్ని వినియోగిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చలికాలంలో శరీరాన్ని కాపాడుకోవాలంటే బెల్లం టీ తాగాల్సిందే.
ఆదే సమయంలో మహిళలకు పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గించి ఉపశమనం అందిస్తుందని వైద్య నిపుణలు సూచిస్తున్నారు.
బెల్లం టీ తాగితే పీరియడ్స్ సందర్భంగా వచ్చే తిమ్మిర్లు, కడుపునొప్పి సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు.
మన పూర్వికులు, ఇంట్లోని పెద్దలు సైతం చలికాలం వచ్చిందంటే బెల్లంతో చేసిన పోషకాహారాలు తినమని చెబుతుంటారు.
ఎందుకంటే బెల్లం పదార్థాలు శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా నిలుపుతాయి. రోజూ ఉదయాన్నే బెల్లం టీ తాగితే రోగాలను దూరం చేసుకోవచ్చు.
details
చలికాలంలో బెల్లం టీ తాగితే కలిగే ప్రయోజనాలివే..
1. బలమైన రోగనిరోధక వ్యవస్థ :
బెల్లంలో క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బి, ఐరన్ సహా అనేక పోషకాలు లభిస్తాయి కనుక చలికాలంలో రోజూ ఉదయం బెల్లం టీ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. బరువు తగ్గడం :
చలికాలంలో బరువు తగ్గాలంటే తక్కువ కేలరీ ఆహారాలనే తినాలి. ప్రతిరోజూ ఉదయం బెల్లం టీ తాగటంతో బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.
3. జీర్ణక్రియ బలోపేతం :
బెల్లం టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ప్రతిరోజూ ఉదయం బెల్లం టీ తాగటంతో జీర్ణక్రియ ఆరోగ్యంగా నిలుస్తుంది.
Details
బెల్లం శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది
4. పీరియడ్స్ నొప్పి నివారణ కోసం :
సాధారణంగా మహిళలు పీరియడ్స్ కాలంలో కొంచెం నీరసంగా ఉంటారు. అయితే అలాంటి సందర్భంలో బెల్లం టీ తాగితే పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
బెల్లం టీ సేవిస్తే పీరియడ్స్ సమయంలో ఏర్పడే తిమ్మిర్లు, కడుపునొప్పి మొదలైన సమస్యల నుంచి రిలీఫ్ అందుకోవచ్చు.
5. శరీరం నుంచి వ్యర్ధాల తరలింపు :
బెల్లం శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. రోజూ బెల్లం టీ తాగితే ఊపిరితిత్తులు, ప్రేగులు, పొట్టను సులభంగా శుభ్రపరుస్తుంది.
బెల్లం ఛాయ్ తాగితే మలబద్ధకం నుంచి సైతం ఉపశమనం పొందవచ్చని నిపుణులు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.