Kerala Tourism : మల్లు సుందర ప్రదేశాలకు వెళ్లే మైమర్చిపోతారు.. ఆహ్లాదకరం, ఆనందం పక్కా
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ అంటేనే ప్రకృతిపరమైన రాష్ట్రం. గాడ్స్ ఓన్ కంట్రీగా ఇప్పటికే ప్రసిద్ధి చెందింది.
ఆ రాష్ట్రంలోని సముద్రాలు, బీచ్ లు, చెరువులు, బ్యాక్ వాటర్ జలాలు, కాల్వలు, పచ్చని చెట్ల అందాలు, సొగసైన కొండలు కోనలు, జలపాతాల సొగబులు, కొబ్బరి చెట్ల అందాలు కనువిందు చేస్తాయి. పర్యాటకులను కట్టిపడేస్తాయి.
కేరళలోని ప్రముఖ పర్యాటకం వీక్షేంచేందుకు ఒక్క రోజు సరిపోదు. కనీసం 4 నుంచి 5 రోజుల పాటు టూర్ వెళ్తే ఎంజాయి మెంట్ గ్యారెంటీ. ఒకవేళ రిఫ్రెష్ మెంట్ కోరుకుంటే మాత్రం కేరళలో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి.
ఉద్యోగ టెన్షన్లు, కుటుంబ బరువులు, బాధ్యతలు, ఇతర ఒత్తిళ్ల నుంచి ఉపశమనం దక్కాలంటే కేరళలోని ఈ అత్యంత సుందర ప్రాంతాలను సందర్శించాల్సిందే మరి.
details
కేరళలో ప్రకృతి రమణీయ ప్రదేశాలేవో తెలుసా
మల్లు రాష్ట్రంలో అతిరాపల్లి, కుమరకోమ్ త్రిస్సూర్, వయనాడ్, అలెప్పీ ప్రాంతాల్లో ప్రకృతి రమణీయ ప్రదేశాలున్నాయి.
అతిరాపల్లి :
దీన్ని భారత్ నయాగరా అని పిలుస్తుంటారు. నయగారా ఆఫ్ ఇండియా జలపాతం అందాలు అసలు నయాగరాకు ఏమాత్రం తక్కువకాని రీతిలో కనిపిస్తుంటుంది.
దట్టమైన షోలయార్ అడవుల్లోని అద్భుత జలపాతం ఇది. సుందరమైన పరిసరాల్లో తాపీగా షికారు చేయొచ్చు.
ప్రవహించే నీటి పొగమంచు అద్భుతాన్ని, దాని అనుభూతిని వర్ణించలేం. ఇక్కడికి సమీపంలోని తుంబూర్ముజి డ్యామ్, వజాచల్ జలపాతాలను సందర్శించవచ్చు.
అత్తిరాపల్లి సహజసిద్ధమైన సౌందర్యం, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి రమనీయం పర్యాటకులను ఒక్కరోజులోనే ఆహ్లాదం అందిస్తాయి.
details
ఆ ద్వీపసమూహం ప్రదేశం మనోహరం
కుమరకోమ్ :
కుట్టనాడ్ రీజియన్ లో వెంబనాడ్ సరస్సు తూర్పు ఒడ్డున ఉన్న కుమరకోమ్ ద్వీపసమూహం ప్రదేశం మనోహరంగా మైమరపిస్తుంటుంది.
నెహ్రూ బోట్ రేస్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇది కీర్తి పొందింది. హైకింగ్ ట్రైల్స్, బీచ్‌లు, జలపాతాలు ఇక్కడి నేచురల్ బ్యూటీని ఇనుమడింపజేస్తాయి.
త్రిస్సూర్ :
కేరళ సాంస్కృతిక రాజధానిగా త్రిస్సూర్ గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో ఒక్క రోజు పర్యటనకు భేష్షుగ్గా ఉంటుంది. మరోవైపు ఈ ప్రదేశం ఎన్నో పండుగలకు సైతం పేరు గాంచింది.
దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి టూరిస్టులను త్రిస్సూర్ ఆకర్షిస్తోంది. హెరిటేజ్ గార్డెన్, ఆర్కియాలజీ మ్యూజియం ఇక్కడి ప్రధాన ఆకర్షణలుగా కీర్తి.
Details
ఆ ప్రదేశంలో థ్రిల్లింగ్ జంతు సఫారీకి వెళ్లొచ్చు
వయనాడ్ :
కేరళలోని వయనాడ్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పొగమంచుతో కూడిన శిఖరాలు, దట్టమైన అటవీ సంపద, సుగంధ ద్రవ్యాల పొలాలతో వయనాడ్ కొండలు చూపరుల మనసు లాగేసుకుంటాయి.
చుట్టూ పచ్చదనం కప్పుకున్న ఈ పరిసరాలు అద్భుతమైన వీక్షణా అనుభవాన్ని కలిగిస్తాయి. రాతి శిల్పాల కోసం ఎడక్కల్ గుహలను ఉదయాన్నే సూర్యుడి వచ్చే సమయానికి సందర్శిస్తే భూతల స్వర్గం చూడొచ్చు.
మరోవైపు ముతంగ జంతు అభయారణ్యం సమీపంలో ప్రశాంతమైన పూకోడ్ సరస్సు సోయగాలను ఎంజాయి చేయొచ్చు. ఇక్కడ ఉన్న జంతు సఫారీ థ్రిల్లింగ్ కలిగిస్తుంది.