కొరియన్ స్కిన్ కేర్.. మీ చర్మానికి అందాన్ని అందించే 8 బ్యూటీ చిట్కాలు
దక్షిణ కొరియా, ఉత్తరకొరియా వాసల చర్మ సౌందర్యానికి ఆకర్షితులు అవ్వని వారున్నారంటే అతిశయోక్తి అవుతుంది. కొరియా దేశాల్లో బ్యూటీలకు కొదవే లేదు. వారిని చూసి ఎట్రాక్ట్ అవ్వని వారు ఉండరేమో. అంతగా నిగనిగలాడుతుంటారు కొరియన్లు. అయితే కొరియన్లు చర్మ సంరక్షణకు కేవలం సహససిద్ధమైన పదార్థాలు మాత్రమే వాడుతుంటడం విశేషం. మీరు కూడా మీ చర్మం మెరిసిపోవాలని అనుకుంటున్నారా? కొరియన్లు స్కిన్ కేర్ టిప్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీని చదివేయండి.
కొరియన్ల చర్మం సహజంగానే కాంతివంతం
కొరియన్ ముద్దుగుమ్మల చర్మం సుతిమెత్తగా, నున్నగా, సున్నితంగా, మృదువుగా, మచ్చలు లేకుండా అద్ధంలా మెరిస్తుంటుంది. అయితే కొరియన్ బ్యూటీలకు మేకప్ వల్లే అంత అందం వస్తుందని అంతా భావిస్తుంటారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వాళ్ల చర్మం సహజంగానే కాంతివంతంగా మైమరపిస్తుంటుంది. దీనికి కారణం కొరియన్ అందగత్తెల స్కిన్ కేర్ రొటీన్. ఆరోగ్య రక్షణలో భాగంగా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. అత్యాధునిక, నేచురల్, విజయవంతమైన పద్ధతులతో, కొరియన్ భామలు అందాన్ని సొంతం చేసుకుంటారు. సౌందర్య సంరక్షణకు కొరియన్లు కేవలం సహజ పదార్థాలపైనే ఆధారపడుతుంటారు. మీరూ గ్లోసీ స్కిన్ పొందాలనుకుంటే అసాధారణమైన ఈ 8 కొరియన్ బ్యూటీ టిప్స్‌ను పాటించండి.
రక్తప్రసరణను పెంచడం కోసం మసాజ్ రోలర్లు
1. డబుల్ క్లీన్సింగ్ కొరియన్లు డబుల్ క్లెన్సింగ్‌పై మక్కువ చూపుతుంటారు. చర్మాన్ని పూర్తిగా శుభ్రపరచడం ముఖ్యమని కొరియన్లు బలంగా విశ్వసిస్తారు. డబుల్ క్లెన్సింగ్ అంటే తొలుత నీటి ఆధారిత క్లెన్సర్‌తో చర్మాన్ని శుభ్రపర్చుకోవడం. ఆపై సన్‌స్క్రీన్, మేకప్‌ను తొలగించేందుకు ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ ను ఉపయోగిస్తారు. 2. గ్లాస్ స్కిన్ గ్లాస్ స్కిన్ కలిగి ఉన్న వ్యక్తి, దానిని గాజులాగా స్పష్టంగా కనిపించేందుకు మాయిశ్చరైజర్లు వినియోగిస్తారు. సీరమ్‌లను పొరలుగా వేయడంతో చర్మానికి ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తుంది. 3. ముఖ మసాజ్ రోలర్లు ఫేషియల్ మసాజ్ రోలర్‌లతో శరీరంలో రక్తప్రసరణను పెంచడం దీని ఉద్దేశం. ఉబ్బును తగ్గించి చర్మ సంరక్షణ ఉత్పత్తుల శోషణను మెరుగుపరచడం ప్రాచుర్యం పొందాయి.రెగ్యులర్ వాడకంతోనే మంచి స్కిన్ టోన్ పొందవచ్చు.
శక్తివంతమైన పోషకాలను అందించే షీట్ మాస్క్‌లు
4. షీట్ మాస్క్‌లు వివిధ చర్మ సమస్యలను పరిష్కరించేందుకు కొరియన్లు ఎక్కువగా షీట్ మాస్క్‌లనే ఉపయోగిస్తారు. ఈ మాస్క్‌లు చర్మానికి తక్షణం శక్తివంతమైన పోషకాలను అందిస్తాయి. 5. స్నెయిల్ ముసిన్ కొరియన్ చర్మ సంరక్షణ చికిత్సల్లో అసాధారణమైన పదార్ధం నత్త మ్యూకిన్‌ను ఉపయోగిస్తారు. గ్లైకోప్రొటీన్లు, హైలురోనిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లలో పుష్కలంగా ఉన్న నత్త మ్యూసిన్, దెబ్బతిన్న చర్మాన్ని సరిచేసేందుకు వినియోగిస్తారు. 6. మోడల్-ఆఫ్-డ్యూటీ మేకప్ ఈ ఫ్యాషన్ "నో-మేకప్"ను వినియోగించాలని నొక్కి చెబుతోంది. ఇది చర్మ సంరక్షణపై దృష్టి సారిస్తూ సహజ సౌందర్యాన్నినిలబెట్టేందుకు BB క్రీమ్‌లు, లిప్ టింట్స్, ఐబ్రో పెన్సిల్స్ వంటి తేలికపాటి సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంది.ే
ప్రకాశవంతంగా మారేందుకు 'హన్‌బాంగ్'
7. హన్‌బాంగ్ హన్‌బాంగ్ అనేది కొరియాలో సాంప్రదాయిక మూలికా ఔషధానికి సంబంధించిన పదం. జిన్సెంగ్, గోజీ బెర్రీలు సహా లైకోరైస్ రూట్ చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉపయోగించే హాన్‌బాంగ్ భాగాలకు ఉదాహరణలు నిలుస్తున్నాయి. చర్మం ఉత్తేజం పొంది శక్తివంతంగా, సమతుల్యతతో, ప్రకాశవంతంగా మారేందుకు ఉపకరిస్తాయని కొరియున్లు అనుకుంటారు. 8. సోక్-గాంగ్-జాంగ్ సోక్-గాంగ్-జాంగ్ టెక్నిక్ వల్ల చర్మం శుద్దీకరణ జరిగి, శోషించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగకరం. మీ ముఖాన్ని మసాజ్ చేసేందుకు ఈ టెక్నిక్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆరోగ్యకరమైన చర్మంతో పాటు మంచి రక్త ప్రసరణను ప్రోత్సహించే సరళమైన పద్ధతే సోక్ గాంగ్ జాంగ్.