LOADING...
International Left Handers Day : లెఫ్ట్ హ్యాండర్స్ డే.. ఎడమ చేతి వాటం ఉన్నవారి అద్భుతమైన లక్షణాలివే
లెఫ్ట్ హ్యాండర్స్ డే.. ఎడమ చేతి వాటం ఉన్నవారి అద్భుతమైన లక్షణాలివే

International Left Handers Day : లెఫ్ట్ హ్యాండర్స్ డే.. ఎడమ చేతి వాటం ఉన్నవారి అద్భుతమైన లక్షణాలివే

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 13, 2025
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనలో చాలామంది కుడి చేతి వాటం కలిగి ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎడమ చేతితోనే ఎక్కువ పనులు చేస్తారు. అందువల్ల వారు నిత్యజీవితంలో కొంత భిన్నంగా కనిపిస్తారు. ఇలాంటి వారిని గుర్తించి, వారి ప్రత్యేకతను జరుపుకునే రోజు ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత, లాభాలు-నష్టాలు, అలాగే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Details

చరిత్ర

ఎడమ చేతివాళ్ల ప్రత్యేకతను గుర్తించడం, వారు ఎదుర్కొనే సవాళ్లపై అవగాహన కల్పించడం కోసం 1976లో అమెరికాకు చెందిన డీన్ ఆర్. క్యాంప్‌బెల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతేడాది ఆగస్టు 13న ఈ రోజు జరుపుతున్నారు. 1992లో లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్ అనే సంస్థ దీన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లి, మరింత అవగాహన కల్పించింది.

Details

 ప్రాముఖ్యత 

ప్రపంచ జనాభాలో ఎడమ చేతి వాటం కలిగిన వారు కేవలం 10శాతం మాత్రమే. వీరికి కొన్ని ప్రత్యేక లాభాలు ఉన్నా, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. రైట్ హ్యాండ్‌కు అనుకూలంగా ఉండే ప్రపంచంలో సిజర్స్, నోట్‌బుక్స్, కంప్యూటర్ మౌస్ వంటి పరికరాలు వాడటం వారికి కష్టసాధ్యమవుతుంది. అయినప్పటికీ, వారి ప్రతిభ, సృజనాత్మకత, ప్రత్యేక ఆలోచనా విధానాన్ని గుర్తించడమే ఈ స్పెషల్ డే ఉద్దేశం.

Details

ఆసక్తికరమైన విషయాలివే 

* చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ క్రియేటివ్‌గా, క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. * వీరి మెదడులో కుడి భాగం (రైట్ బ్రెయిన్) ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. దీని వల్ల ఆర్ట్, మ్యూజిక్, ఊహాశక్తి వంటి రంగాల్లో ఎక్కువ ప్రతిభ కనబరుస్తారు. * వారి భాషా, లాజిక్ ప్రాసెసింగ్ విధానం కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. * ఐన్‌స్టీన్, బిల్ గేట్స్, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు కూడా లెఫ్ట్ హ్యాండర్స్‌లో ఉన్నారు.

Details

లాభాలు

* క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్ వంటి ఆటల్లో ప్రత్యర్థులను కన్ఫ్యూజ్ చేసే ప్రత్యేక టెక్నిక్ వీరికి ఉంటుంది. * సమస్యలను విభిన్న కోణంలో ఆలోచించే సామర్థ్యం ఉంటుంది. * క్రియేటివ్, ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు సాగుతారు. * మల్టీటాస్కింగ్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఇబ్బందులు * రైట్ హ్యాండ్ పరికరాలు వాడటంలో అసౌకర్యం ఉంటుంది. * కొన్ని టీచింగ్ పద్ధతుల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. * ఎడమ చేతివాళ్లందరికీ అన్ని లాభాలు ఉండకపోవచ్చు.