Page Loader
Low Cholesterol : ఖాళీ కడుపుతో ఈ 5 పానీయాలు తాగితే  చెడు కొలెస్ట్రాల్‌ హుష్ కాకీ.. 
ఈ 5పానీయాలు తాగితే చెడు కొలెస్ట్రాల్‌ హుష్ కాకీ

Low Cholesterol : ఖాళీ కడుపుతో ఈ 5 పానీయాలు తాగితే  చెడు కొలెస్ట్రాల్‌ హుష్ కాకీ.. 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 22, 2023
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

కొలెస్ట్రాల్‌ అంటే చాలా మందికి ఇప్పటికీ హడల్. ప్రతీ శరీరానికి కొంత మొత్తంలో కొవ్వులు అవసరం కానీ చెడు కొవ్వులు అక్కర్లేదు. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి గుడ్ కొలెస్ట్రాల్‌, రెండోది బ్యాడ్ కొలెస్ట్రాల్‌. జంక్‌ఫుడ్‌, నూనెల్లో వేయించిన ఆహార పదార్థాల్ని అతిగా తినడం మూలానా అనారోగ్యాల్ని తెచ్చిపెడుతుంది. ఫలితంగా చెడు కొలస్ట్రాల్‌ని కరిగించుకోవడం తప్పనిసరి. నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు వెంటాడే ప్రమాదాలు ఉంటాయి. అందువల్ల పోషకాహారాలు ఎక్కువ ఉండే ఫుడ్, ఫైబర్‌ సహిత ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం లాంటివి అలువాటు చేసుకోవాలి. ఈ క్రమంలో చెడు కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 రకాల పానీయాలు తీసుకోవాల్సిందేనని నిపుణులు అంటున్నారు.

Details

ఉదయాన్నే పరిగడుపున టీ తాగడం వల్ల మంచి ఫలితాలు రెట్టింపు  

1. గ్రీన్‌ టీ : యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్‌ టీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఉదయాన్నే పరిగడుపున ఈ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు రెట్టింపు అవుతాయి. 2. బ్లాక్‌ టీ : కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలంటే తేయాకు టీలో పంచదార, పాలకు బదులు కేవలం టీ పొడి మాత్రమే వేసుకుని బ్లాక్‌ టీ తాగాలి. ఇది కొవ్వుల్ని తగ్గించడంలో దిట్ట. 3. ఓట్‌ మీల్‌ స్మూతీ : ఓట్స్‌ని నానబెట్టి మిక్సీలో వేసి అందులో కొద్దిగా పండ్ల ముక్కలు, పెరుగు వేయాలి. కాస్త తేనెనూ చేర్చి బాగా మిక్సీ చేసుకోవాలి. ఉదయపు అల్పాహారంలో భాగంగా దీన్ని తాగేయాలి.

details

కమలా పండ్లలో విటమిన్‌ సీ, ఫ్లవనాయిడ్లు ఎక్కువ

4. కమలా పండ్ల రసం : కమలా పండ్లు ఎక్కువగా దొరికే సీజన్ ఇది. మూడు, నాలుగు కమలా పండ్లను తీసుకుని చక్కగా రసం తీసుకోండి. ఇందులో విటమిన్‌ సీ, ఫ్లవనాయిడ్లు ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు బాగా పని చేస్తాయి. 5. యాపిల్‌ సైడర్ వెనిగర్‌ : కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ చక్కగా పని చేస్తుంది. ఉదయాన్నే ఓ గ్లాసుడు నీటిని తీసుకుని అందులో కాస్త యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, ఒక చెంచా తేనెతో బాగా కలపాలి. దీన్ని పరగడుపున తాగితే ఫలితాలు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు.