మహశివరాత్రి పండుగ ప్రాముఖ్యత
శివరాత్రి రోజు శివున్ని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి, హిందూ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా శివరాత్రి రోజున ఉపవాసం, ప్రార్థనలు చేసి, ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ప్రతేడాది మాఘ బహుళ చతుర్దశి నాడు మహశివరాత్రిని జరుపుకుంటారు.మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు శివరాత్రి పర్వదినాన శివయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇది శీతాకాలం ముగింపు, వసంతకాలం, వేసవిల ప్రారంభంలో వస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి, ప్రేమ, ఏకత్వం యొక్క స్వరూపంగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు. సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది.
'ఓం నమః శివాయ' మంత్రాన్ని పఠిస్తారు
ప్రతి మాసంలో 14వ రోజు లేదా అమావాస్యకు ముందు వచ్చే రాత్రిని శివరాత్రి అంటారు. ఒక సంవత్సరంలో జరిగే మొత్తం 12 శివరాత్రిలు ఉన్నాయి, వాటిలో ఫిబ్రవరి-మార్చిలో జరుపుకునే మహా శివరాత్రి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివరాత్రి రోజున చాలామంది యువకులు, వృద్ధులు రోజంతా ఉపవాసం రాత్రంతా జాగారం చేస్తారు. భక్తులు ఉదయాన్నే లేచి, ఆచార స్నానంలో పాల్గొంటారు. స్వామికిపాలు, పువ్వులు, తేనె, నెయ్యి, నీరు సమర్పించడానికి ఆలయానికి వెళతారు. వారు 'ఓం నమః శివాయ' అనే పవిత్ర మంత్రాన్ని పఠిస్తారు. మారిషస్‌లో నివసిస్తున్న హిందువులు వివిధ సంప్రదాయాలను నిర్వహించడానికి పవిత్రమైన క్రేటర్ సరస్సు అయిన గంగా తలావ్‌కు వెళతారు. ఈ పండుగ రోజున నేపాల్‌లో జాతీయ సెలవుగా ప్రకటిస్తారు.