
Dussehra Special: కజ్జికాయలు ఇంట్లో సులభంగా ఇలా తయారు చేసుకొండి!
ఈ వార్తాకథనం ఏంటి
దసరా, దీపావళి లాంటి పెద్ద పండగల సందర్భంగా ప్రతి ఇంట్లో పిండి వంటలతోపాటు 'స్వీట్స్' కూడా సిద్ధం చేస్తారు. ఆ స్వీట్స్‌లో ముఖ్యంగా కజ్జికాయలు ఎంతో ప్రాధాన్యం పొందతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వీటిని ఇష్టంగా తింటారు. కానీ చాలా మంది కజ్జికాయలు రుచికరంగా రాకపోవడం సమస్యగా భావిస్తారు. ఇప్పుడు కొన్ని సులభమైన పదార్థాలు, విధానాలు పాటిస్తే ఇంట్లోనే క్రిస్పీ, టేస్టీ కజ్జికాయలు తయారు చేయవచ్చు.
Details
కావాల్సిన పదార్థాలు
2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ 2 కప్పుల మైదా పిండి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి రుచికి సరిపడా ఉప్పు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె ½ కప్పు నువ్వులు ½ కప్పు పల్లీలు ½ కప్పు శనగపప్పు 5 యాలకులు 1 కప్పు బెల్లం ½ కప్పు తురిమిన ఎండు కొబ్బరి ¼ కప్పు పంచదార 1 టేబుల్ స్పూన్ నెయ్యి
Details
తయారీ విధానం
1. రవ్వను నానబెట్టడం బొంబాయి రవ్వను ఓ గిన్నెలో తీసుకుని పావు కప్పు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నానబెట్టాలి 2. పిండి మిశ్రమం మరో గిన్నెలో మైదా పిండి, బియ్యం పిండి,నానబెట్టిన రవ్వ, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. 3. నీరు కలపడం కొద్దిగా నీళ్లు పోసి పిండిని గట్టిగా కలపాలి. 15 నిమిషాలు పక్కకు పెట్టి ఉంచాలి.(గట్టిగా కలపడం కజ్జికాయలను క్రిస్పీగా చేస్తుంది) 4. లోపలి మిశ్రమం తయారీ స్టౌ ఆన్ చేసి పాన్‌లో నువ్వులు, పల్లీలు ఒక్కొక్కటిగా వేయించుకుని చల్లార్చాలి. తరువాత శనగపప్పు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత పల్లీలు వేసి కొద్దిగా ముక్కలుగా ఉండేలా గ్రైండ్ చేయాలి.
Details
5. బెల్లం మిక్సింగ్
ఈ మిశ్రమంలో తరిగిన బెల్లం వేసి బాగా కలిపి మరోసారి గ్రైండ్ చేయాలి. 6. ఎండు కొబ్బరి, పంచదార కలపడం మిశ్రమాన్ని మరో గిన్నెలోకి తీసుకుని తురిమిన ఎండు కొబ్బరి, పంచదార, నెయ్యి వేసి బాగా కలపాలి. (ఆవశ్యకత ఉంటే వేయించుకున్న డ్రైఫ్రూట్స్‌ను కూడా కలుపుకోవచ్చు) 7. పిండితో కలపడం నానబెట్టుకున్న పిండిని తీసుకుని 2 నిమిషాలు కలపాలి 8. కజ్జికాయలు రూపం ఇవ్వడం కొద్దిగా పిండిని తీసుకుని రొట్టెలా తయారు చేసి మధ్యలో మిశ్రమం పెట్టి నీటితో అంచులు మూసివేయాలి. (కజ్జికాయ చెక్క ఉంటే మరింత సులభం)
Details
9. ఫ్రై చేయడం
స్టౌ ఆన్ చేసి గిన్నెలో సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత కజ్జికాయలు లో-ఫ్లేమ్‌లో కొద్దిగా వేయించాలి, పచ్చిదనం తగ్గాక మీడియం ఫ్లేమ్ లో మార్చి రెండో వైపున ఫ్రై చేయాలి. 10. సిద్ధం రెండు వైపులా కాస్త ఎర్రగా కాలిన తర్వాత నూనెలోంచి తీసేయండి. ఫలితంగా క్రిస్పీ, రుచికరమైన కజ్జికాయలు** సిద్ధం!