చింగమ్ 1: మలయాళ నూతన సంవత్సరం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
తెలుగు ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది ఎలా ఉంటుందో, కేరళకు చెందిన మళయాల ప్రజలకు మలయాళ నూతన సంవత్సరం ఉంటుంది. ఇటు తమిళనాడులో, కర్ణాటకలో వారి వారి నూతన సంవత్సరాలు ఉంటాయి. అదలా ఉంచితే, ఈరోజు నూతన మలయాళ సంవత్సరం. దీన్నే మలయాళీలు చింగమ్ 1 అంటారు. ఇంగ్లీషులో జనవరి 1 లాగా మలయాళంలో చింగమ్ 1 అన్నమాట. మలయాళ క్యాలెండర్ లో కూడా మొత్తం 12నెలలు ఉంటాయి. చింగమ్ నుండి మొదలుకుని కన్ని, తులమ్, వృశ్చికం, ధను, మకరం, కుంభం, మీనం, మేడమ్, ఎడవం, మిథునం ఇంకా కర్కిదాకం. చింగమ్ 1 రోజున హిందువులు దేవాలయాలకు వెళ్తుంటారు. కొత్త సంవత్సరంలో జీవితంలో కొత్త శుభాలు జరగాలని కోరుకుంటారు.
చింగమ్ 1 రోజున పంచుకోవాల్సిన సందేశాలు
ఈ నూతన సంవత్సరం మీ ఇంట్లో కొత్త వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ చింగమ్. కొత్తగా వచ్చిన సంవత్సరం మీ జీవితంలో విజయాలను తీసుకువచ్చి మిమ్మల్ని ఉన్నత పథంలోకి తీసుకెళ్ళాలని కోరుకుంటూ చింగమ్ 1 శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజు మీ జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోవాలని, మీకు మీ కుటుంబానికి చింగమ్ 1 శుభాకాంక్షలు. సంప్రదాయంలో ఉన్న అందం, ప్రేమించేవారితో కలిసి ఉండే కాలం, చింగమ్ 1 రోజును మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి. అందరికీ చింగమ్ 1 శుభాకాంక్షలు. జీవితంలో ఏర్పడిన నిరాశను దూరం చేసేవే పండగలు. అలాంటి పండగలను తీసుకొచ్చే కొత్త సంవత్సరం కూడా పండగే. అందరికీ చింగమ్ 1 శుభాకాంక్షలు.