Benefits of Green Chillies: పచ్చి మిరపకాయ తింటే.. ప్రమాదకర వ్యాధులు దూరం
పచ్చి మిరపకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీరు విన్నది నిజమే. పచ్చి మిరపకాయలో విటమిన్ ఎ, బి, సి, కాపర్, పోటాషియం, ప్రొటిన్, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. సాధారణంగా వంటల్లో రుచి కోసం పచ్చి మిరపకాయలను వాడతాం. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల బహుళ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రమాదకర వ్యాధులను నయం చేయడంలో పచ్చి మిరపకాయ ఉపయోగపడుతుంది. పచ్చిమిరపలో ఇనుము, రాగి, పోటాషియం తక్కువ మొత్తంలో ప్రొటిన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో క్యాప్స్తెసిన్ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపుతుంది. ఇక సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో మిరప సాయపడుతుంది
గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయట. డయాబెటీస్‌తో బాధపడుతున్న వారు స్పైసీ ఫుడ్ తినాలనుకుంటే పచ్చి మిరపకాయతో చేసిన ఫుడ్ తీసుకోవచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సాయపడుతుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సాయపడుతంది. మెటిమల సమస్యకు పచ్చిమిరప ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో ఎర్ర మిరప బదులు పచ్చి మిరప తింటే యాసిడ్ రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది.