LOADING...
HBD Megastar Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు స్పెషల్.. మెగాస్టార్ ఫిట్‌నెస్ రొటీన్,డైట్ హ్యాబిట్స్,లైఫ్‌స్టైల్ సీక్రెట్స్ పై ఓ లుక్ ..
చిరంజీవి పుట్టినరోజు స్పెషల్.. మెగాస్టార్ ఫిట్‌నెస్ రొటీన్,డైట్ హ్యాబిట్స్,లైఫ్‌స్టైల్ సీక్రెట్స్ పై ఓ లుక్ ..

HBD Megastar Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు స్పెషల్.. మెగాస్టార్ ఫిట్‌నెస్ రొటీన్,డైట్ హ్యాబిట్స్,లైఫ్‌స్టైల్ సీక్రెట్స్ పై ఓ లుక్ ..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 70 ఏళ్లు వయసు ఉన్నా,ఆయన యంగ్, ఎనర్జిటిక్‌గా ఉండటం, గ్రేస్‌ఫుల్‌గా డ్యాన్స్‌ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ స్థాయిలో అయినా ఇంత యాక్టివ్‌గా ఉండటానికి కారణం ఆయన పాటించే ఫిట్‌నెస్, డైట్ రొటీన్. సాధారణంగా వయసు పెరుగుతున్న క్రమంలో శక్తి తగ్గిపోతుంది,ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కానీ చిరంజీవి మాత్రం ఈ ట్రెండ్‌కు వ్యతిరేకంగా ఉంటూ, వయసు పెరిగినా ఫిట్‌గా, యంగ్‌గా ఉండి ఇతరులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో ఫిట్‌నెస్‌కు ప్రాముఖ్యత ఇచ్చి, 70 ఏళ్లు అయ్యాక కూడా హీరోగా సినిమాలు చేస్తూ, యంగ్ హీరోలను తలపించేలా డ్యాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు అయన ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందాం.

వివరాలు 

ఫిట్‌నెస్ రొటీన్: 

చిరంజీవి ప్రధానంగా బాడీ స్ట్రెంత్,మసిల్ బిల్డింగ్, స్టామినాను పెంచుకునేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తారు. ఇవి శరీర బరువు నియంత్రణ,మెటాబాలిజం పెంపు,హెల్తీగా,యాక్టివ్‌గా ఉండటానికి ఉపయోగపడతాయి. ఇటీవల "విశ్వంభర" సినిమా కోసం జిమ్‌ చేసే వీడియో ఒకటి వైరల్ అయింది. దానిలో ఆయన బెంచ్ ప్రెస్,డంబెల్ కర్ల్స్,స్క్వాడ్స్,కార్డియోపై ఎక్కువగా దృష్టి పెట్టడం కనిపించింది. బెంచ్ ప్రెస్ ద్వారా ఛాతీ,భుజాలు, ట్రైసెప్స్ బలపడతాయి. వయసుతో కలిగే కండర ద్రవ్యరాశి తగ్గుదలను నియంత్రిస్తుంది. డంబెల్ కర్ల్స్ చేతులకు ఆకృతి ఇస్తూ బైసెప్స్‌ను బలపరుస్తాయి. స్క్వాడ్స్ ద్వారా తొడలు,హిప్స్,లెగ్ మసిల్స్ పెరుగుతాయి,బాడీ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది,కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. డెడ్ లిఫ్ట్ వెన్నెముక బలానికి,కార్డియో హృదయం ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.ఈ విధంగా,70 ఏళ్లు అయినా చిరు యాక్షన్, గ్రేస్‌తో అభిమానులను రఫ్పాడిస్తున్నారు.

వివరాలు 

చిరంజీవి డైట్: 

చిరు డైట్‌కు సంబంధించిన సలహాలను ఎక్కువగా తన కొడుకు రామ్ చరణ్ ఇస్తారని ఆయన ఒక సారి వెల్లడించారు. ప్రోటీన్ తీసుకోవడం నుంచి ఫుడ్​ వరకు ఎన్నో సలహాలు తీసుకుంటానని వెల్లడించారు. ఎక్కువగా ఆయన వెజిటేరియన్ డైట్‌ను ఫాలో అవుతారు. బ్యాలెన్స్డ్ మీల్స్‌ను డైట్‌లో చేర్చడం, ఇంటి భోజనాన్ని ప్రాధాన్యం ఇచ్చే ఆచారం,అలాగే సలాడ్స్, సూప్స్ ఎక్కువగా తీసుకోవడం ఆయన డైట్‌లో భాగం. ఈఫిట్‌నెస్, డైట్ ఒక్కసారి చేస్తే కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల కృషి,ఫోకస్ ఉంటుంది. చిన్న వయసు నుంచే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టితే,పెద్దవయసులో కూడా స్ట్రాంగ్‌గా,యాక్టివ్‌గా ఉండవచ్చు. మీరు కూడా చిరంజీవిలా ఆరోగ్యంగా,ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటే,ఈ రోజు నుంచే ఫిట్‌నెస్ రొటీన్ ప్రారంభించండి. మరచిపోకుండా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి.