Mobile Phone Addiction : సెల్'ఫోన్'కు బానిసగా మారారా.. జస్ట్ ఈ ఒక్క పనిచేయండి అంతే
ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ వ్యసనంగా మారిపోతోంది. సమయంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది దెబ్బతీస్తోంది. ఇదే సమయంలో సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. చాలా మందికి చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి వచ్చేసింది. అతిగా సెల్ ఫోన్ వినియోగం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం చూపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యసనం నుంచి బయటపడటానికి సెల్ ఫోన్ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందేనని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే నిద్రలేవగానే సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంటాం. ముఖ్యమైన మెసేజీలు చెక్ చేస్తుంటాం. అనంతరం సోషల్ మీడియా యాప్స్'పైకి మనసు మళ్లుతుంది.
వాళ్లు ప్రభావిత వ్యక్తులుగా భావిస్తున్నారట
ఇక వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్స్టాలను ఆత్రంతో ఓపెన్ చేసేస్తుంటారు. అంతే ఇక సమయం మన చేయి దాటిపోతుంది. నిత్యం ఇదో వ్యసనంగా మారింది. దీని నుంచి బయటపడటం కష్టమవుతుంది. ఇటీవలే Vivo సర్వే ప్రకారం : 90 శాతం ప్రజలు సెల్ ఫోన్ తమ జీవితంలో భాగంగా భావిస్తున్నారట. 83 శాతం మంది పిల్లలు కూడా మొబైల్ ఫోన్లను అలాగే భావిస్తున్నారట. 91 శాతం మంది సెల్ ఫోన్ పాడైతే ఆందోళన చెందుతున్నారట. 89 శాతం మంది పిల్లలు తమను తాము ఆన్ లైన్ ప్రభావిత వ్యక్తులుగా పోల్చుకుంటున్నారట. సెల్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడటం మన చేతుల్లోనే ఉంటుంది.
ఎంత సమయం వేస్ట్ అవుతుందో లెక్కలు వేసుకోవాలి
సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడాలంటే ముందుగా అసలు ఫోన్'తో మీరు ఎంత సమయం గడుపుతున్నారో లెక్కలు వేసుకోవాలి. సెల్ ఫోన్'తో గడిపిన ప్రతి 20 నిముషాలు ఎంత సమయం వృథా అయ్యిందనే అంశాన్ని రాసుకోవాలి. ఫోన్ మాట్లాడిన ప్రతిసారి ఎంత సమయం ఫోన్ మాట్లాడుతున్నారో లెక్కించుకోవాలి. ఇక భోజన సమయాల్లో కూడా సెల్ ఫోన్ దగ్గర ఉంచుకోవడం మానేయాలి. మీ ఫోన్ వాల్ పేపర్ మిమ్మల్ని మైమరపిస్తుంది. అందుకోసం మీ ఫోన్ సెట్టింగ్‌లను మార్చాలి. నలుపు, లేదా తెలుపు వాల్ పేపర్లు పెట్టుకోవడం వల్ల ఫోన్ అట్రాక్ట్ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ రంగులు తక్కువ ఆకర్షణీయంగానూ, తక్కువ డోపమైన్‌ను విడుదల చేస్తాయి.