LOADING...
Diwali 2025: దీపావళికి ప్రత్యేక పూజ.. తులసి ఆచారాలు ఎందుకు ముఖ్యమో తెలుసా?
దీపావళికి ప్రత్యేక పూజ.. తులసి ఆచారాలు ఎందుకు ముఖ్యమో తెలుసా?

Diwali 2025: దీపావళికి ప్రత్యేక పూజ.. తులసి ఆచారాలు ఎందుకు ముఖ్యమో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందువుల పండగలలో దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండగ అమావాస్యా చీకట్లను దీపాల వెలుగులతో తొలగించడంలో విశేషం. పిల్లలు, పెద్దలంతా ఎంతో ఉత్సాహంగా దీపావళిని జరుపుతారు. ప్రతేడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజును దీపావళిగా పండగగా జరుపుకుంటారు. ఈ రోజు ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు, లక్ష్మీదేవి, గణేశుడిని పూజిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా జీవితంలో ఆనందం, శాంతి, సిరి సంపదలకు లోటు లేకుండా, అదృష్టం పెరుగుతుందని మత విశ్వాసం ఉంది. అదేవిధంగా లక్ష్మీదేవి ఆశీస్సులు ఇంటి సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం ఉంది.

Details

ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి

దీపావళి రోజున లక్ష్మీదేవి, గణపతిని పూజించడమే కాకుండా, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక ఆచారాలు కూడా జరుగుతాయి. నమ్మకాల ప్రకారం ఈ రోజున తులసితో కూడిన ఆచారాలు నిర్వహించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి, జీవితంలో శ్రేయస్సు వస్తుందని భావిస్తారు. దీపావళి 2025 తేదీ : వేద క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య అక్టోబర్ 20న తెల్లవారుజామున 03:44 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 21న ఉదయం 05:54 గంటలకు ముగుస్తుంది. అందుచేత దీపావళి పండుగ 2025లో అక్టోబర్ 20న జరుపుకుంటారు.

Details

దీపావళి నాడు తులసి పూజ విధానం 

1. తులసి దగ్గర దీపం వెలిగించాలి. దీపావళి నాడు తులసి మొక్క చుట్టూ దేశీ ఆవు నెయ్యి దీపం వెలిగించి, ప్రదక్షిణ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, సురక్షితమైన జీవితాన్ని అందిస్తుంది. 2. పూజ మొదలుపెట్టే ముందు ఉదయం స్నానం చేయాలి. తులసి మొక్కకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక పెట్టి, ఆవు పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ వస్తువులను వివాహిత స్త్రీకి వాయినంగా అందించడం ద్వారా వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది.

Details

శుభం జరుగుతుంది

3. కొద్దిగా గంగా జలం కలిపిన నీటిని తులసి మొక్కకు సమర్పించాలి. తులసి మంత్రాలను జపించడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి. దీపావళి రోజున ఈ విధంగా చేసిన పూజల ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులతో, నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఇలా దీపావళి నాడు తులసి పూజ చేసే సంపూర్ణ విధానాన్ని పాటించడం ద్వారా ఆర్థిక శ్రేయస్సు, శాంతి, అదృష్టం, సిరి సంపదలు పొందవచ్చు.