LOADING...
Monsoon Tips: రోడ్లపై బురద మీ బట్టలపై పడకుండా ఉండాలంటే..ఈ టిప్స్ పాటించండి!
రోడ్లపై బురద మీ బట్టలపై పడకుండా ఉండాలంటే..ఈ టిప్స్ పాటించండి!

Monsoon Tips: రోడ్లపై బురద మీ బట్టలపై పడకుండా ఉండాలంటే..ఈ టిప్స్ పాటించండి!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

వర్షకాలం మనకు సంతోషంతో బాటుగా మధురమైన జ్ఞాపకాలను అందిస్తుంది. అయితే, కొంతమందికి వర్షాకాలం కొన్ని అసౌకర్యాలను కలిగిస్తుంది. ముఖ్యంగా వర్షంలో బయటకి వెళ్లినప్పుడు, రోడ్లపై ఏర్పడే బురద చాలామందికి పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, ఆఫీసు వెళ్లేవారు, మార్కెట్ కోసం వెళ్లేవారు లేదా చిన్న ప్రయాణాలు చేస్తుంటే ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. చెప్పులు ధరించి, రోడ్లపై నడుస్తున్నపుడు, ప్యాంటులు, చీరలు, గౌన్లు వెనుక బురద అంటడం చాలా మందికి అసౌకర్యంగా మారుతుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.

సమస్య 

ఈ సమస్య ఎందుకు వస్తుంది? 

వర్షం పడిన తర్వాత రోడ్లపై నీరు నిలిచిపోతుంది. ఆ నీటిలోని మట్టి బురదగా మారుతుంది. మనం నడిచేటప్పుడు లేదా బైక్, స్కూటీ నడిపేటప్పుడు ఈ బురద వెనుక నుండి పైకి లేచి నేరుగా మన వీపుపై పడుతుంది. ఫలితంగా, ప్యాంటులు, చీరలు, జీన్స్, గౌన్లపై బురద మరకలు పడతాయి. బురద సమస్య నివారణకు చిట్కాలు దుస్తుల ఎంపికలో జాగ్రత్త వర్షాకాలంలో దుస్తులు ఎంచుకునేటప్పుడు పొడవాటి గౌన్లు, నేల తాకే చీరలు, ప్యాంట్లు వాడకండి. ముదురు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఎందుకంటే ఇవి బురద మరకలను కనిపించకుండా దాచేస్తాయి. అందుకే, ప్రత్యేక రంగులతో కూడిన వర్షాకాల దుస్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

దుస్తులు 

మడిచి బిగించండి

జీన్స్, ప్యాంట్ లను మోకాలి వరకు మడిచి, చిన్న క్లిప్ లేదా సేఫ్టీపిన్‌తో బిగించండి. చీర ధరించిన మహిళలు చీర నేలను తాకకుండా చూసుకోవాలి. మడ్‌గార్డ్‌లు, రెయిన్‌కోట్‌లు కూడా వాడటం చాలా ప్రయోజనకరం. బైక్, స్కూటీ నడిపేటప్పుడు మంచి మడ్‌గార్డ్‌లు ఉపయోగించండి. పొడవైన రెయిన్‌కోట్‌లు మీ కాళ్ళు, దుస్తులను బురద నుంచి రక్షిస్తాయి. బూట్లు, వాటర్‌ప్రూఫ్ లెగ్ గార్డ్స్ మంచి రబ్బరు బూట్లు ధరించండి. వాటర్‌ప్రూఫ్ బూట్లు లేకపోతే, నీరు, బురద బాగా కలవడం జరుగుతుంది. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా లెగ్ కవర్లు తయారుచేస్తాయి, ఇవి ప్యాంట్లు, కాళ్ళను పూర్తిగా కాపాడతాయి.

వివరాలు 

ప్రయాణ మార్గ ఎంపిక

నీరు నిలిచిన ప్రాంతాలు, భారీ ట్రాఫిక్ ఉన్న ప్రదేశాలకు వెళ్లకండి. ఎత్తైన మార్గాలు, చిన్న మార్గాలు ఎంచుకోవడం మంచిది. నెమ్మదిగా నడవడం వల్ల బురద ఎగిరి దుస్తులపై పడకుండా ఉంటుంది. బురద మరకలు బట్టలపై వచ్చిన తర్వాత వాటిని తొలగించడం చాలా కష్టమే. మరకలు పూర్తిగా వెళ్లపోకపోవచ్చు. అందుకనే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం .