Page Loader
పనిచేసే ప్రదేశంలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండడానికి కావాల్సిన టిప్స్ 
పని ప్రదేశంలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పనిచేసే ప్రదేశంలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండడానికి కావాల్సిన టిప్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 27, 2023
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మీరు పనిచేసే ప్రదేశంలో కూడా నీటి ద్వారా అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ప్రస్తుతం మీ పని ప్రదేశంలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నుండి ఎలా సురక్షితంగా ఉండాలో ఇక్కడ చూద్దాం. స్వచ్ఛమైన నీటిని తాగండి పని ప్రదేశంలో మీరు తాగే వాటర్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోండి. పాడుబడిపోయిన నల్లాల నుండి నీరు వస్తే తాగపోవడమే మంచిది. కావాలంటే ఇంటి నుంచి నీళ్ల బాటిల్ తీసుకెళ్లండి. కాచి చల్లార్చిన నీరు లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగండి.

Details

నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై అవగాహన తెచ్చుకోవాలి 

శుభ్రత పాటించండి: మీ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. మూత్ర విసర్జన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోండి. అలాగే భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోకండి. మీ పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి: పని ప్రదేశంలో సహోద్యోగులతో ఆహార పాత్రలను మార్చుకోవడం మానేయండి. కలుషితమైన ఆహారాన్ని దూరం పెట్టండి. రోగ లక్షణాలను ముందుగానే గుర్తించండి: వర్షాకాలంలో వ్యాధులు చాలా సులభంగా వ్యాపిస్తాయి, అందువల్ల ఈ కాలంలో వ్యాపించే వ్యాధులపై అవగాహన తెచ్చుకోండి. సాధారణంగా వర్షాకాలంలో వికారం, వాంతులు, కడుపు నొప్పి లాంటి సమస్యలు చాలా సాధారణంగా వస్తాయి. ఇలాంటి సమస్యలు మీలో కనిపించినట్లయితే మీరు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని అర్థం చేసుకోండి.