మదర్స్ డే రోజున అమ్మకు దూరంగా ఉన్నారా? ఫర్లేదు, ఈ విధంగా సెలెబ్రేట్ చేసుకోండి
ప్రతీ సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవాన్ని జరుపుతారు. 1861నుండి ఇలా జరపడం మొదలైంది. మదర్స్ డే రోజున ఇంట్లో ఉండి అమ్మతో సెలెబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇతర కారణాల వల్ల సొంతింటికి దూరంగా చాలామంది ఉంటున్నారు. అయినా కానీ మదర్స్ డే ని ఉత్సాహంగా జరుపుకోవచ్చు. అదెలానో ఇక్కడ చూద్దాం. కలిసి సినిమా చూడండి: అమ్మకు ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా, అమ్మతో కలిసి సినిమా చూసి మదర్స్ డే ను జరుపుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ అందిస్తున్న టెలీ పార్టీ ద్వారా ఇద్దరూ ఒకేసారి సినిమాను చూడవచ్చు. ఛాట్ బాక్స్ లో ఛాటింగ్ చేయవచ్చు.
అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్ళతో కలిసి జ్ఞాపకాలను పంచుకోవడం
జ్ఞాపకాలకు గంట సమయం: మదర్స్ డే రోజున రాత్రిపూట ఒక గంటసేపు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి జూమ్ కాల్ పెట్టుకోండి. మీ అన్నా, తమ్ముడు, చెల్లి, అక్కా.. ఇలా అందరూ అమ్మతో మాట్లాడండి. అమ్మతో ఉన్నప్పటి జ్ఞాపకాలను పంచుకోండి. పువ్వులతో సందేశం: ఈ కాలంలో పూసే పువ్వులతో కూడిన బొకేను అమ్మకు బహుమతిగా పంపండి. మీరెక్కడున్నా అమ్మకు ఆన్ లైన్ లో ఆర్డర్ చేయండి. భోజనం: అమ్మకు ట్రీట్ ఇవ్వాలనుకుంటే తనకు ఇష్టమైన భోజనాన్ని, ఇష్టమైన రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేయండి. నెక్స్ట్ టైమ్ తప్పకుండా అమ్మతో కలిసి రెస్టారెంట్ కి వెళ్తానని మాటివ్వండి. ఆ మాటను మర్చిపోకండి.