ప్రేరణ: జీవితంలో కష్టం ఉందని తెలుసుకున్నప్పుడే సుఖాన్ని ఎంజాయ్ చేయగలవు
జీవితంలో కష్టాలు రాకుడదని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. దేవుడికి మొక్కుకుంటారు. కానీ మీకి తెలుసా? మీ జీవితంలో అసలు కష్టాలే లేకపోతే సుఖం గురించి మీకెప్పటికీ తెలియదు. అవును, అడిగిన ప్రతీదీ మీ దగ్గరకు వస్తే మీకు ఎంజాయిమెంట్ ఎలా ఉంటుంది? ఒకదాన్ని సాధించాలంటే దానికోసం ఒక యుద్ధం చేయాల్సిన వచ్చినపుడే ఆ సాధించడంలో తృప్తి ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. మీకు బాగా దాహమేసినపుడు పక్కనే ఉన్న నీళ్ళ బాటిల్ తీసుకుని నీళ్ళు తాగేసారు. అప్పుడు మీకేమనిపిస్తుంది. ఏమీ అనిపించదు కదా.. ఇప్పుడు మీకు దాహమేసింది. మీ చుట్టుపక్కల నీళ్ళ బాటిల్ లేదు. ఇంట్లో వాళ్ళని నీళ్ళు తెమ్మన్నారు. ఏదో ప్రాబ్లం వల్ల ఇంట్లో కూడా నీళ్ళు ఐపోయాయి.
ఆనందానికి రుచిని తెచ్చే కష్టం
గంటయ్యింది, నీళ్ళు దొరకలేదు. మీకు దాహం పెరిగిపోతుంది. మీ వీధిలో కూడా నీళ్ళు లేవు. రెండు గంటలయ్యింది. బాగా దాహంగా ఉంది. అదే టైమ్ లో మీ వీధిలో వాటర్ ట్యాంకర్ వచ్చింది. గుక్కెడు నీళ్ళ కోసం వీధి వారితో పోటీ పడుతూ ఎట్టకేలకు ముందుకు ముందుకు నీళ్ళు నింపుకుని గడగడా తాగేశారు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది కదూ. గుక్కనీళ్ళు గొంతును తడుపుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది కదూ. నీళ్ల బాటిల్ ఇవ్వని రుచి, వాటర్ ట్యాంకర్ లో నీళ్ళు ఇవ్వడానికి కారణం కష్టం. అందుకే కష్టాన్ని అసహ్యించుకోకండి. అదే మీ జీవితంలోని ఆనందానికి రుచిని తీసుకొస్తుంది. మీ జీవితాన్ని అందంగా మారుస్తుంది.