
Benefits Of Mustard Oil: చలికాలంలో ఆవనూనెతో బహుళ ప్రయోజనాలు!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ ఫీవర్, స్కిన్ ర్యాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఆవాల నూనెతో బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణ వ్యాధుల నుండి ఉపశమనం కలగడమే కా, కొన్ని తీవ్రమైన వ్యాధుల నుండి ఆవనూనె రక్షిస్తుంది.
శీతాకాలంలో గోరువెచ్చని ఆవాల నూనెతో మసాజ్ చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
ముఖ్యంగా ఆవనూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతో పాటు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు, పాలీఅన్‌శాచురేటెడ్ ప్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్ వంటి పోషకాలు అనేక వ్యాధులు దరి చేయకుండా చేస్తాయి.
శరీరంలో పేరుకుపోయిన చెడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో సాయపడుతుంది.
Details
ఆస్తమా, దగ్గు, పంటి నొప్పి నివారణకు ఆవ నూనె మేలు
చలికాలంలో జలుబు సమస్య విపరీతంగా ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో అవనూనెతో మసాజ్ చేస్తే కఫం నుండి ఉపశమనం లభిస్తుంది.
ముక్కు మూసుకుపోతే వేడి నీటిలో ఆవాల నూనె వేసి ఆవిరి పడితే ఉపశమనం కలుగుతుంది.
ఆవనూనెలలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి, కాసేపు ఉడికించి రాత్రి పడుకొనే ముందు కొన్ని చుక్కలను ముక్కులో వేసుకోవాలి.
ఆవ నూనె క్యాన్సర్ కణాలను తగ్గించడంలో సాయపడుతుందని పరిశోధనలో వెల్లడైంది.
ఈ నూనె వల్ల ఆస్తమా, దగ్గు, పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.