
World Music Day: సంగీతంతో రాళ్లు కరిగిపోతాయి.. మనసు చల్లబడుతుంది!
ఈ వార్తాకథనం ఏంటి
సంగీతం అనేది మన రోజువారీ జీవనశైలిలో ఓ కీలక భాగంగా మారిపోయింది. అందుకే చాలామంది ఖాళీ సమయాల్లో, ప్రయాణాల్లో, పనులకు చిన్న బ్రేక్ తీసుకున్నపుడూ పాటలు వినడం ఇష్టపడతారు. జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం (World Music Day) జరుపుకుంటున్న సందర్భంగా సంగీతం మన ఆరోగ్యంపై కలిగించే పాజిటివ్ ప్రభావాలపై ఓ లుక్కేయండి.
Details
ప్రపంచ సంగీత దినోత్సవం చరిత్ర
సంగీత దినోత్సవాన్ని మొదటిసారి 1982లో ఫ్రాన్స్‌లో జరిపారు. అప్పటి సాంస్కృతిక మంత్రి జాక్వెస్ లాంగ్ సూచనతో ఈ ప్రత్యేక రోజును ప్రారంభించారు. ఈ రోజు ద్వారా సంగీత వినకం వల్ల కలిగే లాభాలను ప్రజలకు తెలియజేయాలన్నదే లక్ష్యం. ఒత్తిడిని తగ్గిస్తుంది సంగీతం వినడం బయోకెమికల్ స్ట్రెస్ రిడ్యూసర్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని అనేక పరిశోధనల ద్వారా నిరూపితమైంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పాటలు విన్నప్పుడు రక్త ప్రసరణ మెరుగవుతుంది. హృదయ స్పందన రేటు, బిపి తగ్గుతాయి. స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ స్థాయి తక్కువవుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
Details
చిరస్మరణీయ క్షణాల కోసం
అల్జీమర్స్ లాంటి మానసిక వ్యాధులకు మ్యూజిక్ థెరపీ ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది మానసిక స్థితిని స్థిరపరచడంలో, రోగికి సంతృప్తిని కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక ఆరోగ్యానికి మేలు సంగీతం మెదడులో డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మూడ్‌ను మెరుగుపరచడంతో పాటు, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మనకు ఇష్టమైన పాటలు మరింత శాంతిని, సంతోషాన్ని అందిస్తాయి నొప్పిని నియంత్రించగలదు నొప్పి సంకేతాలను మెదడులోకి రాకుండా అడ్డుకునే శక్తి సంగీతానికి ఉంది. మ్యూజిక్ థెరపీ ద్వారా నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Details
శక్తిని పెంచుతుంది
వర్కౌట్ సమయంలో పాటలు వినడం శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. శక్తి స్థాయిని పెంచుతూ మరింత సమర్థవంతంగా వ్యాయామం చేయడంలో సహాయపడుతుంది. సంగీతం వినడం ఓ సరదాగా మాత్రమే కాకుండా, మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన టూల్. ఈ సంగీత దినోత్సవాన్ని ఓ మంచి పాటతో సెలబ్రేట్ చేయండి!