LOADING...
HBDNagarjuna: ​'మామ హ్యాపీ బర్త్​డే' .. నాగార్జున యంగ్​గా ఉండటానికి ఫాలో అయ్యే డైట్, ఫిట్​నెస్ సీక్రెట్ ఇవే..
'మామ హ్యాపీ బర్త్​డే' .. నాగార్జున యంగ్​గా ఉండటానికి ఫాలో అయ్యే డైట్, ఫిట్​నెస్ సీక్రెట్ ఇవే..

HBDNagarjuna: ​'మామ హ్యాపీ బర్త్​డే' .. నాగార్జున యంగ్​గా ఉండటానికి ఫాలో అయ్యే డైట్, ఫిట్​నెస్ సీక్రెట్ ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) నిజంగా సక్సెస్ ఫుల్ హీరో మాత్రమే కాకుండా, రియల్ లైఫ్‌లో కూడా రియల్ కింగ్‌గా జీవిస్తున్నారు. 66 ఏళ్ల వయసులో అడుగు పెట్టినప్పటికీ, ఆయన ఆహ్లాదకరమైన సౌందర్యం, యవ్వనం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ, తన స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా, 65 ఏళ్ల వయసులో "కూలీ (Coolie)" సినిమాలో విలన్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, నాగార్జున మామ అందం, చార్మ్ మాత్రం అందరిని మాయ చేశాయి. ముఖ్యంగా చెన్నైలో ఆయన క్రేజ్ ఈ సినిమాతో అసాధారణంగా పెరిగింది.

వివరాలు 

నాగార్జున లేటెస్ట్ లుక్ చూస్తే కింగ్" లేదా "మన్మథుడు అనడం ఖాయం 

తెలుగు ప్రేక్షకులు ఆయనను "కింగ్" లేదా "మన్మథుడు" అని ముద్దుగా పిలవడానికి కారణం ఏంటంటే.. నాగార్జున లేటెస్ట్ లుక్ చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఈ అందం, ఫిట్‌నెస్ వెనుక ఏకంగా అనేక సంవత్సరాల కష్టం ఉంది. పలు ఇంటర్వ్యూల్లో నాగార్జున మామ ఈ విషయాన్ని వివరించారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాలని ఆయన చెప్పారు.

వివరాలు 

డైట్ రొటీన్ 

నాగార్జున ప్రతిరోజూ భోజనం చేస్తారు,కానీ వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తింటారు. ప్రతిభోజనంలో మూడు రకాల ఆకుకూరలు ఉండేలా చూసుకుంటారు. అలాగే,ప్రోటీన్ కోసం చికెన్ లేదా చేపలు కూడా డైట్‌లో ఉంటాయి. ఆయన ఈ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల ప్రోటీన్,కార్బ్స్,ఫైబర్,హెల్తీ ఫ్యాట్స్ సరైన మోతాదులో ఉంటాయని చెప్పారు. వయసు పెరిగిన కొద్దీ కొన్ని ఫుడ్‌లను తప్పించుకోవడం కూడా ఆయన అలవాటు. అలాగే, డైట్ మారుతూ వయసుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారని చెప్పారు. ప్రతిరోజు స్వీట్స్ తీసుకుంటారు,కానీ అది కూడా పరిమితంగా తింటారు. డిన్నర్ త్వరగా ముగించడం,పెరుగు తీసుకోవడం కూడా ఆయన డైట్‌లో భాగం. ఫుడ్ మీద ఎక్కువ నియంత్రణ పెట్టడం కాకుండా,పరిమితంగా, సరిగా తీసుకోవడం ఆయన రొటీన్‌లో ఉంది.

వివరాలు 

వ్యాయామం 

నాగార్జున చెప్పినట్లుగా, ఆహారం సరైనదిగా తీసుకోవాలంటే వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తారు. దీని వల్ల మెటబాలిజం హై అవుతుంది, ఖాళీగా కూర్చున్నా బాడీ సొంతంగా పని చేస్తూ కేలరీలు బర్న్ అవుతాయి. ఈ వ్యాయామం ఆయన లైఫ్స్టైల్‌లో 35 సంవత్సరాలుగా భాగంగా ఉంది. వ్యాయామం చేయలేకపోతే కనీసం రన్నింగ్ లేదా స్విమ్మింగ్ చేస్తారు.

వివరాలు 

ఫిట్‌నెస్ రహస్యం 

నాగార్జున ఫిట్‌గా ఉండటానికి సింపుల్ కానీ ఎఫెక్టివ్ రహస్యం ఏంటంటే... ఎక్కువ ఆలోచించకపోవడం. ఏ విషయం జరిగినా ఆలోచించకుండా, మైండ్ క్లియర్‌గా ఉంచడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందని తెలిపారు. అలాగే, తన ఫ్యామిలీ జీన్స్ కూడా ఫిట్‌నెస్‌కు సహాయపడతాయని, వాటిని కాపాడుకుంటున్నానని "కూలీ" ప్రమోషన్స్‌లో వెల్లడించారు. నాగార్జునలా 66 ఏళ్లలో కూడా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఇప్పుడే డైట్‌లో మార్పులు చేయడం, ఫిట్‌నెస్ రొటీన్ అలవాటు చేసుకోవడం అవసరం. వాళ్లు సెలబ్రెటీలు వారు ఏమి చేసినా కుదురుతుంది అనుకోకండి. సాధ్యమైన సింపుల్ వ్యాయామాలు చేయడం, వాక్ చేయడం, డైట్‌లో మార్పులు తీసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. అప్పుడు మీరు కూడా నవ యువ మన్మథుడిగా మారిపోవచ్చు.