నేషనల్ వర్క్ హాలిక్స్ డే: పని తప్ప మరో ధ్యాసలేని వారి కోసం ఒకరోజు ఎందుకు ఉంటుందో తెలుసా?
వర్క్ హాలిక్స్.. సాధారణంగా ఆఫీసుల్లో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పని తప్ప మరో ధ్యాస లేని వారి వర్క్ హాలిక్స్ అంటారు. ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, స్నేహితులు మొదలగు వాటిని పట్టించుకోకుండా పనిచేసుకుంటూ పోతుండే వర్క్ హాలిక్స్ కోసం ప్రతీ ఏడాది జులై 5వ తేదీన నేషన వర్క్ హాలిక్స్ డే ని జరుపుతున్నారు. పని మాత్రమే కాకుండా బయట ప్రపంచ కూడా ఉందని వారికి గుర్తు చేయడం కోసమే ఈరోజును జరుపుతున్నారు. వర్క్ హాలిక్ అనే పదాన్ని మొదటగా 1968లో రాడ్నీ డేంజర్ ఫీల్డ్ అనే కమెడియన్ ఉపయోగించారు. ఒకవారంలో ఎవరైతే 40గంటల కంటే ఎక్కువ సమయం పనిచేస్తారో వారిని వర్క్ హాలిక్స్ గా పరిగణిస్తారు.
60గంటలు పనిచేసే వర్క్ హాలిక్స్
వర్క్ హాలిక్స్ సాధారణంగా వారంలో 50, 60 ఒక్కోసారి అంతకంటే ఎక్కువ గంటలు కూడా పనిచేస్తారు. దీనివల్ల జీవితం మీద ప్రభావం పడుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ తర్వాత అనేక ఇబ్బందులు కలుగుతాయి. వర్క్ హాలిక్స్ ప్రెండ్స్ తో పంచుకోవాల్సిన కొటేషన్లు: పని ముఖ్యమే, కానీ ఆరోగ్యం అంతకన్నా ముఖ్యం. పనిని, జీవితాన్ని బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్ళడం నేర్చుకో, హ్యాపీ వర్క్ హాలిక్స్ డే. వర్క్ హాలిక్స్ డే రోజున ఎక్కువ పనిచేయకుండా వర్క్ కాకుండా బయట ప్రపంచ ఉందని గుర్తించు- హ్యాపీ వర్క్ హాలిక్స్ డే. ఎంత కష్టపడి చేస్తావో, అంతలా విశ్రాంతి అవసరం. విశ్రాంతి లేకపోతే రేపు కష్టపడేందుకు శక్తి రాదన్న సంగతి గుర్తుపెట్టుకో.