Niksen: ఒత్తిడిని మాయం చేసే డచ్ జీవనశైలి నిక్సెన్...పదండి రిలాక్స్ అవుదాం మరి
ఒత్తిడిలో పడి అలసిపోయారా...అయితే కొద్ది సేపు నిక్సెన్ ను పాటించండి. ఈ నిక్సెన్ ఏమిటి అనుకుంటున్నారా? ఖాళీ బుర్ర దయ్యాల కొంప, ఏమీ చేయకుంటే జీవన పరుగులో వెనుకబడిపోతాం అనే పాత సామెతల్ని కొద్ది సేపు పక్కనబెట్టండి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ ఉరుకు పరుగుల జీవితం కొద్దిరోజులకు మనల్ని ఒత్తిడిలోకి నెట్టేయవచ్చు. అటు శరీరం ఇటు మనసూ కూడా అలసిపోవనూ వచ్చు. ఇలాంటి ఒత్తిడిని జయించేందుకు మనల్ని మనం ఫుల్ గా రీచార్జ్ చేసుకునేందుకు అప్పుడప్పుడూ నిక్సెన్ లైఫ్ స్టైల్ ను పాటించమంటున్నారు సైకాలజిస్టులు. ఏంటా నిక్సెన్ లైఫ్ స్టైల్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇటీవల డచ్ దేశంలో ఈ విధానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
అలసిపోయారా...అయితే నిక్సెన్ లైఫ్ స్టైల్ పాటించండి
ఏమాత్రం మనసు ఒత్తిడికి గురైనా లేదా శరీరం అలసిపోయినట్లు అనిపించినా ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేందుకు కొద్దిగా రిలాక్స్ కావడమే ఈ నిక్సెన్ జీవన శైలి. అంతేనా నిక్సెన్ లైఫ్ స్టైట్ అంటే అనుకుంటే పొరబాటే మరి. రిలాక్స్ కావడమంటే ఏ బీచ్ కో వెళ్లి సేదదీరడమో లేదా సినిమాకో వెళ్లడం లాంటిది కాదు నిక్సెన్ లైఫ్ స్టైల్ అంటే. నిక్సెన్ లైఫ్ స్టైల్ ను సరైన మాటల్లో నిర్వచించడమంటే ఏ పనీ చేయకుండా అలా బద్ధకంగా ఉండిపోవడం. ఇలా ఏ పనీ చేయకుండా ఉండిపోవడం కూడా ఓ కళే అంటున్నారు సైకాలజిస్టులు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ నిక్సన్ లైఫ్ స్టైల్ మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అధ్యయనాల్లో తేలింది మరి...
మనకున్న బీజీ లైఫ్ లో అప్పుడప్పుడూ ఏ పనీ చేయకుండా ఏమీ ఆలోచించకుండా ఉండటం వల్ల మనకు బోలెడంత మేలు జరుగుతుందంటారు మానసిక శాస్త్రవేత్తలు. ఇప్పుడు డచ్ వాళ్లు ఫాలో అవుతున్న ఈ జీవనశైలికి ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ అనే ఫిలాసఫీ అనే పేరు పెట్టుకున్నారు. ఇటీవల అధ్యయనాల్లో కూడా నిక్సెన్ డచ్ లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతున్న వారికి కాస్త మంచి ఫలితాలే వచ్చాయని తేలింది. ఈ నిక్సెన్ లైఫ్ స్టైల్ పై ఓల్గా మెకింగ్ అనే వ్యక్తి ఏకంగా ఓ పుస్తకమే రాసేశారట. మనం ఏమీ చేయకుండా ఉండటం అంటే సోషల్ మీడియాలో రీల్స్ చూడటం కాదని అస్సలు పనేమీ చేయకుండా అలా ఉండిపోవడం అని చెబుతున్నారు.
నిక్సెన్ లైఫ్ స్టైల్ మీద పుస్తకమే రాసేశారట...
ఆ క్షణంలో మన బుర్రలో ఉన్న చెత్తంతా పక్కన బెట్టి ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేయడం. మనం గోవా వెళ్లి సేద తీరాలనుకున్నప్పుడు మనకున్న పనుల ఒత్తడి వల్ల అది సాధ్యం కాలేదనుకోండి . కాసేపు ఆ పనుల్ని పక్కన బెట్టి అలానే కూర్చుని ఉండటం. ఈ క్షణంలో మనల్ని మనం రీచార్జ్ చేసుకుని మళ్లీ పనులు కొనసాగించడమే నిక్సన్ లైఫ్ స్టైల్ . గ్రీక్ ద్వీపంలోని వాళ్లంతా, నెదర్లాండ్స్ వాసులు కూడా ఇదే ఫాలో అవుతున్నారని తెలిసింది. ఫలితంగా వారు ఆఫీస్ లో పనిచేసే సామర్థ్యం బాగా పెరిగినట్లు చెబుతున్నారు. అప్పుడప్పుడూ అలా నిక్సెన్ లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతూ మనల్ని మనం రీ చార్జ్ చేసుకుందాం మరి.