Noni Fruit: ఈ పండు తింటే చాలు.. క్యాన్సర్‌తో పాటు మరెన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకృతిలో లభించే పండ్లు, కాయల్లో రోగాలను నయం చేసే గుణం ఉంటుంది. అయితే వాటిల్లో తొగరు పండు(Noni Fruit) కీలకమైన ఔషధాలను కలిగి ఉంది.
ఈ పండును అందరూ గుర్తు పట్టకపోవచ్చు. కొవిడ్ కాలం తర్వాత నుంచి ఈ పండ్లకి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. దాదాపుగా 100పైగా రోగాలను నయం చేసే శక్తి ఈ తొగరు పండ్లకు ఉంది. ఇందులో 150పైగా పోషక విలువలు ఇమిడి ఉండటం విశేషం.
ఇటీవలే తొగరు పండ్లు మార్కెట్లో విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ చెట్టు ఆకులను, కొమ్మలను ఆయుర్వేదం మందుల తయారీలో వినియోగిస్తారు.
తొగరు పండ్లతో 10 రకాల క్యాన్సర్ వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణలు అంటుంటారు.
details
స్థూలకాయాన్ని నిరోధించేందుకు నోని(తొగరు పండు) ఉత్తమం
కరోనా తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తిపై అవగాహన పెరిగింది. దాన్ని పెంచుకునేందుకు తొగరు పండ్ల జ్యూస్ తాగుతున్నారు. దీని ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
నోని ఫ్రూట్ లో యాంటీ ఒబేసిటీ(స్థూలకాయాన్ని నిరోధించే) పోషకాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. ఈ పండ్లను జ్యూస్ చేసుకుని తాగితే సులువుగా బరువు తగ్గుతారని అంటున్నారు.
షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండు తిన్నా లేక జ్యూస్ తాగినా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణలు వివరిస్తున్నారు. వీటిలో బీటా గ్లూకాన్స్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉన్నాయి.
తొగరు పండు హైబీపీ నియంత్రిస్తుంది. కిడ్నీ రోగులకూ ఈ పండు ఉపశమనం కలిగిస్తుంది. అయితే రోజూ తినేముందు నిపుణుల సలహాలను పాటించడం ఉత్తమం.