ఆడపిల్లలు తక్కువ వయసులో పుష్పవతి అవ్వడానికి కారణాలు
పిల్లలు యుక్తవయసులోకి వెళ్తున్నప్పుడు పుష్పవతి అవుతారు. యుక్తవయసులోకి రావడమనేది ఆడపిల్లల్లోనూ, మగపిల్లల్లోనూ ఉంటుంది. కాకపోతే కొందరు ఆడపిల్లలు 8ఏళ్ల వయసు కంటే ముందుగా, అబ్బాయిలు 9ఏళ్ళ వయసు కంటే ముందుగా యుక్తవయసు లక్షణాలను పొందుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఊబకాయం: అధిక లావు కారణంగా పిల్లల్లో తొందరగా యుక్తవయసు లక్షణాలు కనిపిస్తాయి. కొవ్వు కణాల కారణంగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కావడంతో రొమ్ము భాగం పెరగడం, రుతుక్రమం కలగడం సంభవిస్తుంటుంది. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల: పిల్లలు తొందరగా యుక్తవయసు లక్షణాలను పొందడానికి ఇది కూడా ఓ కారణమే. జంక్ ఫుడ్ లోని కొవ్వులు, జంతువుల నుండి లభించే ప్రొటీన్ మొదలగునవి పుష్పవతి కావడానికి కారణంగా నిలుస్తాయి.
తొందరగా యుక్తవయసు లక్షణాలు కనిపించడానికి కారణాలు
పోషకాహార లోపం: పోషకాలు లేని ఆహారాలు తినడం వల్ల ఆలస్యంగా యుక్తవయసు లక్షణాలు వస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో తొందరగా కనిపించే అవకాశం ఉంది. పోషకాహార లోపాన్ని తగ్గించడానికి శరీరం ఎక్కువ హార్మోన్లు విడుదల చేయడమే దీనికి కారణం. ఒత్తిడి: చిన్నప్పుడు జరిగిన సంఘటనలు పిల్లల్లో బలమైన ముద్ర వేస్తాయి. అనుకోని సంఘటనల తాలూకు ఒత్తిడి పిల్లల్లో ఉన్నప్పుడు హార్మోన్లు గతి తప్పుతాయి. అలాంటి సందర్భాల్లో ఆడవాళ్ళలో యుక్తవయసు లక్షణాలు కనిపిస్తాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా: పెరుగుతున్న డిజిటల్ వాడకాల వల్ల పిల్లలకు అన్నిరకాల కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. దానివల్ల పిల్లల్లో హార్మోన్ల స్థాయిలు పెరగడం జరుగుతుంది. ఈ కారణంగా కావాల్సిన వయసు కంటే ముందుగా యుక్తవయసు లక్షణాలు కనిపిస్తాయి.