Page Loader
International Tiger Day 2023: పులులను చూడాలంటే అక్కడికి పోవాల్సిందే..!
International Tiger Day 2023: పులులను చూడాలంటే అక్కడికి పోవాల్సిందే..!

International Tiger Day 2023: పులులను చూడాలంటే అక్కడికి పోవాల్సిందే..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2023
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనం జూకీ వెళ్లినప్పుడు పక్షులు,కోతులు వంటివి కనిపించకపోయినా పెద్దగా ఫీల్ అవ్వం, కానీ పులులు, సింహాలు వంటివి కనిపించకపోతే మాత్రం చాలా నిరాశకు గురవుతాం. పులి ఆకారం, నడక ఆ గంభీరత్వం చాలా ఠీవీగా ఉంటాయి. అందుకే చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు పులులను చూడటానికి ఇష్టపడుతుంటారు. ఇండియాలో మొత్తంగా 3167 పులులు ఉన్నాయి. హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్కులో పులులను చూడొచ్చు. దేశంలోని టైగర్ రిజర్వ్, నేషనల్ పార్కులోని పులులకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. పులులను దేశంలోని ఏ ఏ ప్రాంతాల్లో చూడచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Details

ఇండియాలో పులులు ఉండే పార్కులు ఇవే

కార్బెట్ టైగర్ రిజర్వ్, ఉత్తరాఖండ్ రణతంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్ బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ పెంచ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ సాత్పురా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ పన్నా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ కజిరంగా నేషనల్ పార్క్, అసోం సుందర్బన్స్ నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్ నాగర్‌హోల్ నేషనల్ పార్క్, కర్ణాటక బందీపూర్ నేషనల్ పార్క్, కర్ణాటక పెరియార్ నేషనల్ పార్క్, కేరళ మానవ చర్యలతో నేడు పులులు అంతరించిపోతున్నాయి.అందుకే, వీటి సంరక్షణ కోసం ప్రతీ ఏడాది జూలై 29న 'అంతర్జాతీయ పులుల దినోత్సవం' ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒడిశా పూరీ బీచ్ లో సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్ పట్నాయక్