Organic Holi Colours at Home: కెమికల్స్ లేని హెలీ రంగులను ఇంట్లోనే మీరే తయారు చేసుకోండిలా!
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ అంటే రంగుల పండుగ. ఈ ప్రత్యేకమైన రోజు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ముఖ్యంగా బావా-మరదల్లు, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
నిజానికి, రంగులు చల్లుకోవడం ఒక రకమైన ఆనందాన్ని కలిగించినా, కొన్ని హానికరమైన రంగులు చర్మానికి, జుట్టుకు, శరీరానికి నష్టం కలిగించే అవకాశం ఉంది.
మార్కెట్‌లో లభించే రంగుల్లో రసాయనాలు,హానికరమైన పదార్థాలు ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం.
అప్పుడేమిటి? హోలీ ఆడకూడదా?
కచ్చితంగా ఆడాలి! అయితే,హానికరమైన కెమికల్ రంగులను వదిలిపెట్టి,సహజమైన (ఆర్గానిక్) రంగులతో హోలీని మరింత ఆనందంగా జరుపుకోవచ్చు.
సహజ రంగులను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.అదీ మన వంటింట్లో ఎప్పుడూ ఉండే కూరగాయలతోనే!
ఇవి చర్మానికి హాని కలిగించకుండా,హోలీని మరింత ఆరోగ్యకరంగా, అందంగా మార్చేలా చేస్తాయి.
వివరాలు
ఇప్పుడు, సహజంగా హోలీ రంగులు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం!
1. గులాబీ రంగు (Pink Colour)
గులాబీ రంగు అంటే అందరికీ ఇష్టమైనది. ప్రేమకు,ఆనందానికి చిహ్నమైన ఈ రంగును ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులభం.
తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్‌లో రెండు కప్పుల బీట్‌రూట్ తురుము తీసుకోండి. ఒక కప్పు నీరు వేసి,బాగా కలిపి మూడు నిమిషాల పాటు ఉంచండి.స్ట్రైనర్ సహాయంతో బీట్‌రూట్ నీటిని వడకట్టండి.మరో బౌల్‌లో బియ్యం పిండి/కార్న్ ఫ్లోర్/టాల్కమ్ పౌడర్ మూడు కప్పులు తీసుకుని, దానిలో బీట్‌రూట్ నీటిని కలపండి. మిశ్రమాన్ని బాగా కలిపి,పొడి రూపంలోకి వచ్చేలా చేయండి. మరింత సువాసన కోసం రోజ్ వాటర్ రెండు స్పూన్లు కలపండి.ఎండలో రెండు రోజులు ఆరబెట్టండి లేదా ఓవెన్లో వేడి చేయండి. అంతే! సహజమైన గులాబీ రంగు సిద్ధం!
వివరాలు
2. పసుపు రంగు (Yellow Colour)
పసుపు రంగు ఆరోగ్యానికి మంచిది. దీన్ని సహజంగా తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం: రెండు కప్పుల నీటిని మరిగించండి. అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల పసుపు కలపండి. (ఫుడ్ కలర్ కూడా వాడొచ్చు, కానీ సహజ పసుపే మంచిది). నీరు గాఢంగా మారిన తర్వాత, చల్లారనివ్వండి. తర్వాత, బియ్యం పిండి/కార్న్ ఫ్లోర్/టాల్కమ్ పౌడర్‌లో కలిపి బాగా మిక్స్ చేయండి. మిశ్రమాన్ని ఎండలో ఆరబెట్టండి లేదా ఓవెన్లో వేడి చేయండి. అంతే! సహజమైన పసుపు రంగు రెడీ!
వివరాలు
3. ఆకుపచ్చ రంగు (Green Colour)
ఆకుపచ్చ రంగును వేపాకుతో తయారు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
తయారీ విధానం: కొత్తిమీర, పాలకూర లేదా వేపాకులను మిక్సీలో వేసి, కొద్దిగా నీరు కలిపి పేస్టులా చేసుకోండి. ఈ పేస్ట్‌ను వడకట్టి, గట్టిగా నింపిన నీటిని వేరుగా పెట్టుకోండి. బియ్యం పిండి/కార్న్ ఫ్లోర్/టాల్కమ్ పౌడర్‌లో ఈ వేపాకు నీటిని కలిపి బాగా మిక్స్ చేయండి. ఎండలో రెండు రోజులు ఆరబెట్టి లేదా ఓవెన్లో వేడి చేసి వాడుకోండి. సహజమైన ఆకుపచ్చ రంగు సిద్ధం!
వివరాలు
4. నీలి రంగు (Blue Colour)
హోలీ పండుగలో నీలి రంగు ఉండకపోతే అసంపూర్ణమే. దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం: నీలి రంగు కోసం సహజమైన ఫుడ్ కలర్ తీసుకుని, బియ్యం పిండి/కార్న్ ఫ్లోర్/టాల్కమ్ పౌడర్‌తో బాగా మిక్స్ చేయండి. మిశ్రమాన్ని ఎండలో ఆరబెట్టి, అవసరమైతే ఓవెన్లో వేడి చేయండి. నీలి రంగు తయారైనట్టే!
5. నారింజ రంగు (Orange Colour)
నారింజ రంగును క్యారెట్‌తో తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం: రెండు కప్పుల క్యారెట్ తురుము తీసుకుని, ఒక కప్పు నీటితో బాగా కలపండి. స్ట్రైనర్ ద్వారా వడకట్టి,క్యారెట్ నీటిని వేరుగా ఉంచండి. బియ్యం పిండి/కార్న్ ఫ్లోర్/టాల్కమ్ పౌడర్‌లో క్యారెట్ నీటిని కలిపి బాగా రబ్ చేయండి. మరింత సువాసన కోసం రోజ్ వాటర్ కలపండి.
వివరాలు
6. ఎరుపు రంగు (Red Colour)
మిశ్రమాన్ని ఎండలో ఆరబెట్టి, అవసరమైతే ఓవెన్లో వేడి చేయండి. సహజమైన నారింజ రంగు రెడీ!
ఎరుపు రంగు లేకుండా హోలీ అసంపూర్ణం. దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం: ఒక బౌల్‌లో కొద్దిగా నీరు తీసుకుని, అందులో పసుపు, నిమ్మరసం వేసి కలపండి. నీరు ఎరుపు రంగులోకి మారిన తర్వాత, బియ్యం పిండి/కార్న్ ఫ్లోర్/టాల్కమ్ పౌడర్‌లో కలిపి మిక్స్ చేయండి. మిశ్రమాన్ని ఎండలో ఆరబెట్టి, అవసరమైతే ఓవెన్లో వేడి చేయండి. సహజమైన ఎరుపు రంగు రెడీ!
వివరాలు
హోలీని సురక్షితంగా జరుపుకోవాలంటే..
కెమికల్ రంగులను పూర్తిగా దూరంగా పెట్టండి. సహజమైన రంగులు వాడండి.
రంగులు ఆడే ముందు చర్మానికి కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ రాసుకోండి. జుట్టుకు ఆయిల్ అప్లై చేయండి, తద్వారా రంగులు అతుక్కుపోకుండా ఉంటాయి.
రంగులు ఆడిన తర్వాత తేలికపాటి షాంపూ, సోప్ వాడి శుభ్రం చేసుకోండి. ఇక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు!
ఇలా సహజమైన రంగులతో హోలీని మరింత ఆనందంగా, ఆరోగ్యకరంగా జరుపుకోండి. మరేం ఆలస్యం?
హోలీ రంగులను సిద్ధం చేసుకోండి.. ఈ పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకుందాం!