Papaya : బొప్పాయి తింటే ఎన్ని లాభాలో.. అద్బుతమైన 8 ప్రయోజనాలివే
బొప్పాయి పండు అంటే తెలియవారు ఉండరేమో. అంతలా ప్రతి ఇంటికి చొచ్చుకెళ్లింది ఈ కాయ. దీన్ని నిత్యం ఆహారంలో చేర్చుకుంటే పోషకాహారాలు లభిస్తాయి. 1. జీర్ణక్రియ సజావుగా సాగాలంటే బొప్పాయి తినాల్సిందే. 2. రోగనిరోధక శక్తిని సైతం పెంచడంలో ఈ కాయ సహకరిస్తుంది. 3. క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది. 4. ఆస్తమాను అడ్డుకోవడంలోనూ బొప్పాయి కృషి చేస్తుంది. 5. ఎముకల బలానికి బొప్పాయి శ్రేష్టం. 6. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బొప్పాయి తినొచ్చు. అలాంటి వారికి ఇది ఎంతో మంచి చేస్తుంది. 7. గుండె ఆరోగ్యానికి బొప్పాయి తోడ్పడుతుంది. 8. కాలేయం పనితీరు ఆరోగ్యవంతంగా ఉండేలా తోడ్పాటు అందిస్తుంది. అయితే వైద్యుల సలహా మేరకు బొప్పాయి పండును స్వీకరిస్తే మరీ మంచిది.
ఇళ్లల్లో సర్వ సాధారణంగా కనిపించే బొప్పాయి పోషకాల గని
భారతీయ ఇళ్లల్లో సర్వ సాధారణంగా కనిపించే బొప్పాయిలోని పోషక ప్రయోజనాలు తెలిస్తే దాన్ని వదలకుండా తింటారు. 152 గ్రాముల బరువున్న ఓ చిన్న బొప్పాయిలో 59 కేలరీలు శక్తి, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1 గ్రాము ప్రోటీన్, 3 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇందులో విటమిన్ C, A, K, పొటాషియం, ఫోలేట్ (విటమిన్ B9) అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది. వృద్ధులు, ప్రీడయాబెటిక్స్,కాలేయ వ్యాధులు, థైరాయిడ్ సమస్యల బాధితులు ఆక్సిడైజ్డ్ కొలస్ట్రాల్ వల్ల ఇబ్బందిపడతారు. వీరు బొప్పాయి తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు అల్జీమర్స్ వ్యాధి పోరాటంలోనూ బొప్పాయి కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఓ వైద్య నివేదిక తెలిపింది.
బొప్పాయిలోని లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీరం నుంచి అదనపు ఐరన్ తొలగించడంలోనూ బొప్పాయి పనిచేస్తుంది.బొప్పాయిలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఇది మెదడులోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి.ఫలితంగా క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. క్యాన్సర్ రోగుల చికిత్సలోనూ బొప్పాయిదే హవా.ఇందులోని బీటా కెరోటిన్ స్పష్టమైన కంటి చూపును అందిస్తుంది.మరోవైపు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడేందుకు ఇది సహకరిస్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్ కణాలను తగ్గిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.విటమిన్ K తక్కువగా ఉన్న వ్యక్తులు ఎముక పగుళ్లతో బాధపడితే బొప్పాయి తీసుకుంటే ఎముకలు బలోపేతమవుతాయి. కడుపునొప్పిని ఎదుర్కోవడంలో సహాయపడే పాపైన్, మరో ఎంజైమ్ చైమోపాపైన్ ప్రొటీన్లను విచ్ఛిన్నం చేయడంలో దిట్ట. ఫైబర్, వాటర్ అధిక కంటెంట్ మలబద్ధకాన్ని నివారించడంలో కృషి చేస్తుంది. ఇది సాధారణ ప్రేగు కదలికను అనుమతిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.