Page Loader
Paratha Girl:ఢిల్లీలోని వడ పావ్ గర్ల్ తర్వాత వైరల్ అవుతున్నపరాఠా గర్ల్.. థాయ్‌లాండ్‌లోని పుయ్ కార్ట్‌ వద్ద భారీగా గుమిగూడిన జనం
వైరల్ అవుతున్నపరాఠా గర్ల్

Paratha Girl:ఢిల్లీలోని వడ పావ్ గర్ల్ తర్వాత వైరల్ అవుతున్నపరాఠా గర్ల్.. థాయ్‌లాండ్‌లోని పుయ్ కార్ట్‌ వద్ద భారీగా గుమిగూడిన జనం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 26, 2024
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో చెప్పాల్సిన పని లేదు. దిల్లీకి చెందిన వడ పావ్ అమ్మాయి అయినా, డాలీ చాయ్‌వాలా అయినా, వారు రాత్రికి రాత్రే వైరల్‌గా మారారు. ఇప్పటికే, పరాఠాలను తయారుచేసే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా థాయిలాండ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ అమ్మాయి ఇండియాలో కూడా ఫారిన్ ఫ్లేవర్ ఇస్తూ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

వివరాలు 

ప్రత్యేకమైన శైలిలో పరాఠా

ఢిల్లీకి చెందిన వడా పావ్ గర్ల్ తర్వాత,ఇప్పుడు ఢిల్లీకి చెందిన మరో అమ్మాయిని ప్రజలు పరాఠా గర్ల్ అని పిలుస్తున్నారు. థాయిలాండ్ నుంచి వచ్చి ఢిల్లీ వీధుల్లో జనాలకు ఫారిన్ ఫ్లేవర్ అందించిన ఈ అమ్మాయి పేరు పుయ్. థాయిలాండ్‌కు చెందిన పుయ్ తన సోదరితో కలిసి ఢిల్లీ వీధుల్లో పరాఠాలను విక్రయిస్తోంది.ఆమె అరటి పరాటా,గుడ్డు పరాటా వంటి రుచికరమైన వంటకాలను అమ్ముతుంది. వడ పావ్ గర్ల్ తర్వాత,ఇప్పుడు పరాఠాలు తినడానికి పుయ్ స్టాల్ వద్ద జనంగుమ్మిగూడడం మొదలు పెట్టారు. పుయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో'puyrotilady'అనే పేజీని కూడా నడుపుతోంది.దీనిలో ఆమెకు 1లక్ష27 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. సోదరీమణులిద్దరూ ప్రజలకు ప్రత్యేకమైన శైలిలో పరాఠాను వడ్డిస్తారు.పరాఠాని బాగా అలంకరించిన తర్వాత,వారు దానిని కస్టమర్‌కు తినడానికి ఇస్తారు.