NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Parenting Tips : మీ పిల్లల అల్లరి ఎక్కువైందా.. మాట వినట్లేదా..కారణాలివే కావొచ్చు
    తదుపరి వార్తా కథనం
    Parenting Tips : మీ పిల్లల అల్లరి ఎక్కువైందా.. మాట వినట్లేదా..కారణాలివే కావొచ్చు
    మీ పిల్లల అల్లరి ఎక్కువైందా.. మాట వినట్లేదా..కారణాలివే కావొచ్చు

    Parenting Tips : మీ పిల్లల అల్లరి ఎక్కువైందా.. మాట వినట్లేదా..కారణాలివే కావొచ్చు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 04, 2023
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఒక్కోసారి చెప్పిన మాట వినకుండా మొండికేస్తారు. అల్లరి చేస్తారు. మారాం చేస్తారు. పట్టుబడతారు. అడిగింది తప్పక ఇప్పించాలంటారు.

    ఇంటువంటి సమయాల్లో తల్లిదండ్రులు (Parents) వారితో కఠినంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులే కానీ చక్కటి పరిష్కారం రాదు.

    అయితే వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారనే కారణాలని కనుక్కోవాలి.

    ఈ నేపథ్యంలోనే బడికి వెళ్లే పిల్లలు, ఎదిగే పిల్లలు ఒక్కోసారి పేరెంట్స్ చెప్పిన మాట వినరు. ఈ మేరకు వారికి నచ్చినట్టు తినడం,చదువుకోవడం,ఆటలు తమకు తోచినట్లు చేస్తామంటుంటారు.

    మొండిగా ప్రవర్తించే పిల్లల పట్ల కొందరు పేరెంట్స్ కఠినంగా వ్యవహరిస్తుంటారు. అలా కాకుండా పిల్లలు మాట వినాలంటే ఏం చేయాలో తెలుసా

    Details

    ఫోకస్ పెట్టేంత టైమ్ లేకపోతే కష్టం

    ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులుగా మారడం, పిల్లలపై కావాల్సినంత ఫోకస్ పెట్టేంత సమయం లభించట్లేదు.

    ఇటువంటి సమయాల్లో తమకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత దొరకట్లేదని పిల్లలు మొండికేస్తుంటారు.

    ఒక్కోసారి చెప్పిన మాట వింటే ఏదో కొనిస్తామని తల్లిదండ్రులు మాట ఇచ్చి బుజ్జగిస్తుంటారు. ఇటువంటి సందర్భాల్లో కొందరు ఆ మాట నెరవేర్చలేకపోతారు.

    ఫలితంగా తల్లిదండ్రుల మీద పిల్లలకు నమ్మకంపోయి భవిష్యత్'లోనూ పిల్లలు తమకు నచ్చినట్టు ప్రవర్తించేందుకు అవకాశం ఇచ్చినట్లే అవుతుంది.

    ఇదే సమయంలో విధుల్లో నిమగ్నమైన కొందరు తల్లిదండ్రులు పిల్లల భావోద్వేగాలను పట్టించుకోకపోతే వారిలో ఆహారం- ఆకలి, విసుగు, ఒంటరితనం వంటివి తిష్టవేస్తాయి.

    DETAILS

    పిల్లలతో సత్ప్రవర్తనతో మెలిగాలి  

    దీంతో మొండిగా మారే ముప్పు ఉంటుంది. తల్లిదండ్రులతో గడపాలని, తమ మాట వినాలని పిల్లలు సహజంగానే కోరుకుంటారు.

    పిల్లలను ఏదో సాకుతో దగ్గరకు రానీయకుండా చేయడం, వాళ్లు చెప్పేది వినకుండా నిరాకరించిన క్రమంలో పిల్లలు నిరుత్సాహానికి గురవుతారు.

    దీంతో పెద్దవాళ్లు ఏం చెప్పినా వినరు, దానికి అంగీకరించరు అనే ఫీలింగ్ కలుగుతుంది. దీంతో తమకు తోచిన రీతిలో ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివే పిల్లల ఎదుగుదల, భవిష్యత్ పై ప్రభావం చూపిస్తుంటాయి.

    అందుకే పేరెంట్స్ సున్నితమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని పిల్లలతో బాధ్యతతో, క్రమశిక్షణతో వ్యవహరించాలి. లేదంటే ఏం చెప్పినా పిల్లలు వినకుండా మొండికేసే సమస్య పొంచి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పిల్లల ఆహారం

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    పిల్లల ఆహారం

    తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి ఉత్తర్‌ప్రదేశ్
    Food: ఐదేళ్ళ లోపు పిల్లలు తినకూడని ఆహరాలు తెలుసుకోండి.  ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025