పిల్లల పెంపకం: మీ పిల్లలు బయట ఆడుకోవట్లేదా? భవిష్యత్తులో జరిగే ప్రమదాలు ఇవే
ప్రస్తుత తరంలో పిల్లలు బయట ఆడుకోవడం బాగా తగ్గిపోయింది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద అతి జాగ్రత్త చూపిస్తూ బయట ఆడుకోవడానికి పంపట్లేదు. కాలు నేలమీద పడితే కందిపోతాయన్నంత లెవెల్లో పెంచుతున్నారు. ఈ అతి జాగ్రత్త భవిష్యత్తులో పిల్లలకు హాని చేస్తుంది. బయట ఆడుకోవడం వల్ల పిల్లలకు ఎలాంటి లాభాలు ఉంటాయో చూద్దాం. శరీరం దృఢంగా మారుతుంది: బయట ఆడుతున్నప్పుడు పరుగెడతారు, కింద పడతారు, దూకుతారు.. ఇలా రకరకాలుగా శరీరాన్ని వంచుతారు. దీనివల్ల శరీరం దృఢంగా మారుతుంది. ఆటలాడటం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఎమోషనల్ స్కిల్స్ వృద్ధి చెందుతాయి: బయట ఆడటం వల్ల నలుగురు కలుస్తారు. వాళ్లతో మాట్లాడటం వల్ల ఎమోషనల్ విషయాలు అర్థమవుతాయి.
బయట ఆడటం వల్ల ప్రకృతితో, సమాజంతో పెరిగే సంబంధాలు
సమాజంతో ఎలా ఉండాలో తెలుస్తుంది: బయట ఆడుకునేటపుడు రకరకాల ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొనే క్రమంలో సమాజంతో ఎలా ఉండాలో అర్థమవుతుంది. బేరం చేసే లక్షణాలు, అవతలి వాళ్ళతో ఎలా మాట్లాడాలన్న విషయాలు అర్థమవుతాయి. నమ్మకం పెరుగుతుంది: ఆత్మవిశ్వాసం పెరగడం ఇక్కడ ముఖ్యమైన అంశం. అది బయట ఆడుకున్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఉదాహరణకు పిల్లలు ఆడుతూ పాడుతూ చెట్టు ఎక్కారనుకోండి. ఆ నమ్మకం వారిలో చాలా శక్తినిస్తుంది. ప్రకృతిలో మమేకం: బయట ఆడటం వల్ల ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. చల్లగాలినీ, చల్లని వర్షాన్నీ, ఎండ వేడినీ.. అన్నింటినీ ఆనందించే గుణం పెరుగుతుంది. పెరుగుతున్న సమయంలో ఇవి చాలా అవసరం. జీవితాన్ని ఆనందించాలంటే ప్రకృతితో కొంతలో కొంత సంబంధం ఉండి తీరాల్సిందే.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి