ఊపిరితిత్తులను ఇబ్బందికి గురి చేసే నిమోనియా లక్షణాలు, రావడానికి కారణాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఊపిరితిత్తులు ఉబ్బిపోయి తీవ్రమైన దగ్గు, కఫం వస్తుంటే అది నిమోనియా లక్షణం కావచ్చు. దీనికి కారణం బాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ అయ్యుండవచ్చు. నిమోనియా తీవ్రత అది ఎలా వచ్చిందన్న దానిమీద ఆధారపడి ఉంటుంది.
వైరస్ ద్వారా వచ్చే న్యూమోనియా కంటే బాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా ప్రాణాంతకంగా ఉంటుంది. పసిపిల్లలు, చిన్నపిల్లలు, టీనేజ్, వృద్ధులకు నిమోనియా తొందరగా వ్యాపిస్తుంది.
నిమోనియా కారణంగా ఊపిరితిత్తులు ఉబ్బుతాయి. వాటిల్లో కఫం, చీము, ద్రవాలు చేరిపోతాయి. ఇది రెండు ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు అత్యవసరంగా ట్రీట్ మెంట్ చేయాల్సి ఉంటుంది.
లేకపోతే ప్రాణాలకే ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుంది. అందుకే నిమోనియా గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఆరోగ్యం
నిమోనియా ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బాక్టీరియా, ఫంగస్, వైరస్ వల్ల నిమోనియా వస్తుందని తెలుసుకున్నాం. ఐతే ఇవే కాకుండా జలుబు, కోవిడ్ 19 వంటి వ్యాధులు నిమోనియాకు దారి తీస్తాయి. నిమోనియా అంటువ్యాధి కాదు, కానీ నిమోనియాకు కారణమయ్యే బాక్టీరియాలు ఇతరులకు అంటుకుంటాయి.
నిమోనియా లక్షణాలు: నిమోనియాతో బాధపడేవారు 105ఫారెన్ హీట్ జ్వరంతో ఇబ్బంది పడతారు. ఎక్కువసార్లు దగ్గడం వల్ల ఛాతినొప్పి వస్తుంది. దగ్గినప్పుడల్లా పసుపు, ఆకుపచ్చ రంగులో కఫం బయటకు వస్తుంది. కడుపునొప్పి, అలసట ఎక్కువగా ఉంటుంది.
ట్రీట్ మెంట్: దీన్ని తగ్గించడానికి చాలా రకాల ట్రీట్ మెంట్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్ ఎక్కించాల్సి ఉంటుంది. నిమోనియా రాకుండా నిరోధించాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలి. పొగతాగడం మానుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తినాలి.