LOADING...
Raksha Bandhan 2025: రేపే రక్షా బంధ‌న్‌.. ఏ స‌మ‌యంలో రాఖీ క‌ట్టాలో తెలుసా..?
రేపే రక్షా బంధ‌న్‌.. ఏ స‌మ‌యంలో రాఖీ క‌ట్టాలో తెలుసా..?

Raksha Bandhan 2025: రేపే రక్షా బంధ‌న్‌.. ఏ స‌మ‌యంలో రాఖీ క‌ట్టాలో తెలుసా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కా-చెల్లెళ్ల ప్రేమ, బంధం, అనురాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం రాఖీ పండగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారి నుంచి రక్షణకు హామీగా ఆశీర్వాదాన్ని పొందుతారు. అన్నదమ్ముళ్లు తమ సోదరీమణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ పండుగ సందర్భంగా వాగ్దానం చేస్తారు. అయితే ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు జరగబోతుంది? ఏ సమయానికే రాఖీ కట్టడం శుభం? మరి ఏ సమయంలో కట్టకూడదు? అన్నవాటికి సమాధానాలు ఈ వివరాల్లో తెలుసుకుందాం.

వివరాలు 

ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు? 

ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజునే రాఖీ పండుగ జరుపుకుంటారు. 2025 సంవత్సరానికి అనుగుణంగా ఈ పౌర్ణమి ఆగస్టు 9న,శనివారం రోజున ఉంది. అందువల్ల రాఖీ వేడుకలను ఆగస్టు 9న శనివారమే జరుపుకుంటారు. ఇది శ్రావణ మాసంలోని శుక్రవారం తరువాతి రోజు కావడం విశేషం. రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం ఎప్పుడు? జ్యోతిష్య నిపుణుల ప్రకారం,ఆగస్టు 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాఖీ కట్టేందుకు అత్యంత శుభకాలంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో రాఖీ కడితే విష్ణుమూర్తి అనుగ్రహం లభించడంతో పాటు, సోదరులు, సోదరీమణులు శాంతి, సౌభాగ్యంతో తమ బంధాన్ని మరింత బలపర్చుకుంటారని పండితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

భద్రకాలంలో రాఖీ కట్టడం శుభమా? 

పంచాంగ శాస్త్ర ప్రకారం, 'భద్ర' అనేది పౌర్ణమి లేదా అమావాస్య తిథులలో కనిపించే ఒక అశుభకాలం. చంద్రుడు కర్కాటక, సింహ, కుంభ లేదా మీన రాశిలో ఉన్నపుడు భద్ర కాలం ప్రారంభమవుతుంది. ఈ రాశుల్లో చంద్రుడు ఉన్నంతసేపూ భద్ర కాలం కొనసాగుతుంది. ఈ కాలంలో ఏ శుభకార్యాన్ని చేసినా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని పూర్వీకులు నమ్ముతారు. అందువల్ల రాఖీ వంటి పవిత్రమైన శుభకార్యాన్ని భద్రకాలం ముగిసిన తర్వాత, ముఖ్యంగా అపరాహ్న సమయంలో నిర్వహించమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది సోదరుల ఆరోగ్యం, ఆనందం, శుభకాంక్షల కోణంలో కూడా మేలుగా భావించబడుతుంది.

వివరాలు 

రాఖీ కట్టేటప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలి? 

రాఖీ కట్టే సమయంలో తెలుపు రంగు దుస్తులు ధరించడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. తెలుపు రంగు శుభానికి, పవిత్రతకు సంకేతం. ఆ రంగు దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలు మరింత మెరుగ్గా లభిస్తాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అటు సోదరులు, ఇటు సోదరీమణులు కూడా ఈ దుస్తుల ఎంపికలో శ్రద్ధ వహిస్తే రాఖీ వేడుకలు మరింత ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇలా ఈ ఏడాది రాఖీ పండుగను సరిగ్గా శుభ సమయంలో,అనుకూల దుస్తుల్లో జరుపుకుంటే బంధం బలపడడమే కాకుండా దైవానుగ్రహం కూడా లభిస్తుంది. రక్షాబంధన్ శుభాకాంక్షలు!