కేశ సంరక్షణ: మండే వేసవిలో చుండ్రు బారి నుండి తప్పించుకోవాలంటే చేయాల్సిన పనులు
వేసవిలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మాడు భాగంలో నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ నూనెల మీద దుమ్ము, ధూళి చేరినపుడు చుండ్రు తయారవుతుంది. అందుకే వేసవిలో జుట్టు గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా వేసవి కాలంలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి వారంలో కనీసం మూడుసార్లు తలస్నానం చేస్తే చుండ్రును తయారు కావడాన్ని నివారించవచ్చు. తలస్నానం చేసిన ప్రతీసారీ షాంపూ వాడకూడదు. షాంపూ ఎక్కువగా వాడితే జుట్టు పొడిగా మారుతుంది. పొడిజుట్టు కారణంగా చుండ్రు తయారవుతుంది. జుట్టును విరబోసుకుంటే చుండ్రు సమస్యను నివారించవచ్చు. వారానికోసారి ఆయిల్ తో జుట్టుకు మర్దన చేయండి. ఈ కారణంగా రక్తప్రసరణ మెరుగ్గా జరిగి చుండ్రు కాకుండా ఉంటుంది.
చుండ్రు తొలగించడానికి పనికొచ్చే ఇంటి చిట్కాలు
చుండ్రు ఏర్పడకుండా జాగ్రత్తలుతీసుకోవడమే కాకుండా ఏర్పడిన తర్వాత ఎలా తొలగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. పెరుగు చేసే మేలు: పెరుగును కొద్దిగా పలుచగా చేసి జుట్టుకు మాస్క లాగా పెట్టుకోవాలి. 20నిమిషాల తర్వాత షాంపూ చేసుకుంటే బాగుంటుంది. కలబంద రసం: ఇంటి ముందు ఈజీగా పెరిగే కలబంద, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కలబంద రసాన్ని తీసి జుట్టుకు పట్టించండి. అరగంట తర్వాత తలస్నానం చేయండి. యాపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన నిష్పత్తిలో తీసుకుని తలస్నానం చేసిన తర్వాత తడిగా ఉన్న జుట్టుకు మర్దన చేయాలి. 15నిమిషాల తర్వాత జుట్టును కడిగేస్తే బాగుంటుంది.